అప్పటికి బాబు పుట్టకపోవడం మన అదృష్టం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అప్పటికి బాబు పుట్టకపోవడం మన అదృష్టం

అప్పటికి బాబు పుట్టకపోవడం మన అదృష్టం

Written By news on Thursday, August 4, 2016 | 8/04/2016


అప్పటికి బాబు పుట్టకపోవడం మన అదృష్టం
నెల్లూరు :
భారతదేశానికి స్వాతంత్ర్య సాధన కోసం పోరాటం జరిగినప్పుడు అప్పటికి చంద్రబాబు నాయుడు పుట్టకపోవడం మనం చేసుకున్న అదృష్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం నెల్లూరు శ్రీ కస్తూరిదేవి గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన 'యువభేరి' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాటం నాటికి ఈయన పుట్టి ఉంటే.. బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్యం ఎప్పుడిస్తే అప్పుడు తీసుకుందాం, తొందర ఏముంది, స్వాతంత్ర్యం ఏమైనా సంజీవనా అనేవారని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం ఒక్కటి వస్తే సరిపోతుందా.. ఇంక ఏమీ అవసరం లేదా అనేవారని విమర్శించారు. ఆరోజు చంద్రబాబు పుట్టకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టమని, ఇప్పుడు ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మనం చేసుకున్న ఖర్మ అని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 
 
 • ప్రత్యేక హోదాకు సంబంధించి చర్చ జరుగుతున్న కార్యక్రమంలో నాకన్నా ముందు దాదాపు 40 మంది విద్యార్థులు, యువత.. అందరూ మాట్లాడారు
 • నేను వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా గురించి ప్రొఫెసర్ మాల్యాద్రి, శ్రీనివాస్, రామిరెడ్డి, విద్యార్థి నాయకులు విశ్వరూప ఆచారి, శ్రావణ్ కుమార్, సుధీర్ గౌడ్, రూప, సలామ్, జక్కంపూడి రాజా.. అందరూ హోదా గురించి మాట్లాడారు
 • ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావన చేయాల్సి వచ్చినప్పుడు.. అందరినోటా వచ్చే మాట ఒక్కటే. అందరం చదువుకుంటున్నాం.. కొందరి చదువులు అయిపోయి ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు
 • చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కావాలని ఎవరు అనుకుంటున్నారు.. దాదాపు ప్రతి చెయ్యీ పైకి ఎత్తారు
 • చదువులు అయిపోయాక ఉద్యోగం కావాలన్న నినాదం ప్రతిస్వరం చేస్తోంది
 • మనకు ఉద్యోగాలు కావాలంటే.. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు అన్న మాట ఏంటి?
 • ఎన్నికలకు ముందు ఏ గోడ చూసినా, ఏటీవీలో ప్రకటన చూసినా.. ఆయన ఏం మాట మాట్లాడినా ప్రతి నోటా ప్రతిరోజూ వినిపించింది.. జాబు కావాలంటే బాబు సీఎం కావాలన్నారు
 • బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాబులు మనకు వచ్చాయా.. 
 • రాష్ట్రంలో బాబు సీఎం అయ్యేసరికి లెక్కలు కట్టి 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలుకట్టారు
 • ప్రతి ఇంటికీ ఉద్యోగం, అది ఇవ్వకపోతే ఇంటికి 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు
 • ఆ ఉద్యోగాల కోసం నెలల తరబడి సిటీలలో ఏపీపీఎస్సీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు
 • రెండు, మూడు రూపాయల వడ్డీకి దానికోసం తల్లిదండ్రులు అప్పులు తీసుకుని పిల్లలకు డబ్బు పంపుతున్నారు
 • రెండేళ్ల నుంచి పిల్లలు చదువుతున్నా, ఏపీపీఎస్సీ పరీక్షలు పెట్టిన పాపాన పోలేదీ పెద్దమనిషి
 • కనీసం ఎప్పుడు పెడతామో ఆ తేదీ కూడా ప్రకటించలేదు
 • చంద్రబాబు రెండేళ్లలో చేసిందేంటి అంటే.. డీఎస్సీ పరీక్షలు పెట్టారుగానీ ఫలితాలు రాలేదు
 • మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే ఉద్యోగాలు రావడం సాధ్యమవుతుంది. ఆ హోదాను కూడా నీరుగారుస్తున్నారు
 • హైదరాబాద్ లాంటి నగరాన్ని రాష్ట్రం నుంచి విడగొట్టేటప్పుడు ఇదే చంద్రబాబు, ఇదే కాంగ్రెస్,  ఇదే బీజేపీ పార్లమెంటు సాక్షిగా అందరూ ఒకే మాట అన్నారు
 • హైదరాబాద్ లాంటి నగరం పోతోంది, కాబట్టి హైదరాబాద్‌లోనే 95 శాతం ఐటీ పరిశ్రమలున్నాయి, 70 శాతం ఉత్పాదక రంగం కూడా అక్కడే ఉంది, అలాంటి నగరం కట్టడానికి 60 ఏళ్లు పట్టింది.
 • చదివిన ప్రతి పిల్లాడూ ఉద్యోగం కోసం నేరుగా హైదరాబాద్‌కే వెళ్తాడు
 • ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా ఇస్తామని అధికార, ప్రతిపక్షాలు ఒక్కటై కలిసికట్టుగా చెప్పాయి. 
 • పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు ఇద్దరూ ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టారు
 • ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ వాళ్లు ఐదేళ్లు చాలదు.. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు
 • చివరకు రాష్ట్రాన్ని విడగొట్టారు.. తర్వాత ఎన్నికలు జరిగాయి
 • ఇదే బీజేపీ, ఇదే చంద్రబాబు ఎన్నికల్లో మేనిఫెస్టో ప్రకటించారు
 • తాము అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామని అందులో తెలిపారు
 • ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక ఇదే పార్లమెంటులో నిస్సిగ్గుగా చెబుతున్నారు
 • ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి రకరకాల కారణాలు వెతుకుతున్నారు
 • ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల మన రాష్ట్రానికి జరిగే మేలు ఏంటో తెలుసా అని అడుగుతున్నా
 • ప్రత్యేక హోదా వల్ల ప్రధానంగా రెండు మేళ్లు జరుగుతాయి
 • ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటు, 10 శాతమే రుణం అవుతుంది
 • అంటే ఆ 90 శాతాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు
 • ఆ హోదా లేకపోతే గ్రాంటు నిధులు కేవలం 30 శాతం, రుణం 70 శాతం అవుతుంది
 • రెండోమేలు మనందరికీ సంబంధించినది
 • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే పారిశ్రామిక అభివృద్ధికి ఇన్సెంటివ్స్ ఇస్తారు.
 • వందశాతం ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఎక్సైజ్ డ్యూటీ కట్టక్కర్లేదు, కరెంటు 50 శాతం సబ్సిడీతో దొరుకుతుంది
 • వాళ్లు ఉత్పత్తి చేసే వస్తువులకు రవాణా ఖర్చు కూడా తిరిగి వెనక్కి ఇస్తారు
 • ఈ రాయితీలన్నీ కేవలం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకే ఉంటాయి
 • ఈ రాయితీలుంటే చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలను తేవడానికి ఎక్కడెక్కడికో వెళ్లక్కర్లేదు
 • చైనా, సింగపూర్, దావోస్, రష్యా వెళ్లాల్సిన అవసరం ఉండదు
 • ఇలాంటి పారిశ్రామిక ఇన్సెంటివ్‌లు ఉంటే మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి క్యూకడతారు
 • లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి, వేలసంఖ్యలో పరిశ్రమలు, లక్షల్లో ఉద్యోగాలు వచ్చేపరిస్థితి ఏర్పడుతుంది
 • మనకు ప్రత్యేక హోదా వస్తే, నో వేకెన్సీ బోర్డులు కాదు.. వాంటెడ్ బోర్డులు కనిపిస్తాయి
 • ఇలాంటి రాయితీలుంటే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది
 • ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు దీన్ని నీరుగారుస్తున్నారు
 • ఎన్నికలు అయిపోయాక మోదీ, చంద్రబాబు కలిసి ప్రజలకు టోపీ పెడుతున్నారు
 • చంద్రబాబు తెలంగాణలో అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయించేందుకు డబ్బులిస్తూ ఎప్పుడు ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయారో.. ఆరోజే ప్రత్యేక హోదాకు తెరపడింది
 • ఇక ఆయన మోదీని ప్రశ్నించే పరిస్థితి లేదు
 • ఇదే చంద్రబాబు మోదీని గట్టిగా ప్రశ్నిస్తే.. ఆయన సీబీఐని రంగంలోకి దింపుతారేమోనని భయం
 • నీకు చిత్తశుద్ధి ఉందా అని చంద్రబాబును అడుగుతున్నా
 • అది ఉంటే.. మోదీకి ఒక టైం ఇచ్చి, ఆ సమయంలోగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకుంటానని ఎందుకు అల్టిమేటం ఇవ్వలేరని అడుగుతున్నా
 • ఇవ్వకపోగా.. ప్రత్యేక హోదాను చంద్రబాబు దగ్గరుండి నీరుగారుస్తారు
 • ఇదేమైనా సంజీవనా, అది వస్తే అన్నీ జరిగిపోతాయా అంటారు
 • కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని కూడా ఆయన అన్నారు
 • ఈ తీరు చూసి చంద్రబాబే ప్రత్యేక హోదా అవసరం లేదంటున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి, మోదీగారికి ధైర్యం పెరిగిపోయింది
 • అందుకే వాళ్లు పార్లమెంటులోనే హోదా ఇవ్వం పో అని చెప్పారు
 • ఎన్నికలకు ముందు అదే పార్లమెంటు సాక్షిగా ఇస్తామన్న హోదాను.. ఇప్పుడు మళ్లీ అదే పార్లమెంటులో ఇచ్చేది లేదని చెప్పినా, చంద్రబాబుకు సిగ్గురాలేదు.
 • జైట్లీ పార్లమెంటులో అలా మాట్లాడాక చంద్రబాబు బయట ప్రెస్ మీట్ పెట్టారు
 • అప్పుడైనా చంద్రబాబులో పౌరుషం వస్తుందని ఎదురు చూశాం
 • కానీ చంద్రబాబు ఏమన్నారో చూస్తే బాధ కలిగింది
 • ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రభుత్వంలో కొనసాగుతామని చెప్పారు
 • మీరెవ్వరూ మోదీని తిట్టకండి, బీజేపీని ఏమీ అనకండి, పార్లమెంటులో గొడవ చేయకండని ఎంపీలకు ఉద్బోధ చేశారు
 • ఇలాంటి సీఎం పరిపాలన చేస్తే ఇక మనకు ప్రత్యేక హోదా వస్తుందా అని అడుగుతున్నా
 • స్వాతంత్ర్యం కోసం పోరాడేటప్పుడు ఆ సమయంలో చంద్రబాబు పుట్టకపోవడం మన అదృష్టం
 • అప్పుడు ఈయన పుట్టి ఉంటే.. బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్యం ఎప్పుడిస్తే అప్పుడు తీసుకుందాం, తొందర ఏముంది, స్వాతంత్ర్యం ఏమైనా సంజీవనా అనేవారు
 • స్వాతంత్ర్యం ఒక్కటి వస్తే సరిపోతుందా.. ఇంక ఏమీ అవసరం లేదా అనేవాడు
 • ఆరోజు చంద్రబాబు పుట్టకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టం
 • ఇప్పుడు ఆయన సీఎంగా ఉండటం మనం చేసుకున్న ఖర్మ
 • ప్రత్యేక హోదాపై దుష్ప్రచారాలు చేస్తున్నారు, పార్లమెంటులో అబద్ధాలు చెబుతున్నారు
 • 14వ ఆర్థికసంఘం ఒప్పుకోలేదు కాబట్టి ఇవ్వలేదని జైట్లీ చెప్పారు
 • కానీ జైరాం రమేష్‌కు 14వ ఆర్థికసంఘం సభ్యుడు రాసిన లేఖలో.. అసలు తాము ప్రత్యేక హోదా ఇవ్వద్దని అననే అనలేదని చెప్పారు
 • ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తున్నారా లేదా అని మా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంటును అడిగారు
 • దానికి వచ్చిన లిఖిత సమాధానంలో.. ఆ హోదాను ఉపసంహరించుకునే ఆలోచన ఏమీ లేదని తెలిపారు
 • ఒకవైపు ప్రత్యేక హోదా కొనసాగిస్తూ, మరోవైపు మీరే 14వ ఆర్థికసంఘం ఇవ్వద్దని చెప్పిందంటారు
 • ఇలా పొంతన లేకుండా మాట్లాడుతుంటే.. ఇంతమంది కుట్రపన్ని ఒక రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుండా చూస్తుంటే పార్లమెంటరీ వ్యవస్థను చూసి తలదించుకోవాలనిపిస్తోంది
 • ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి
 • ఎన్నికల సమయంలో ఎవరైనా ముఖ్యమైన నాయకులు ఒక మాట చెబితే.. దానిమీద నిలబడే కార్యక్రమం జరగాలి
 • ఎన్నికల సమయంలో గోడల మీద రాసిన రాతలేంటి.. రైతుల బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలన్నారు.
 • డ్వాక్రారుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు
 • ఇంటింటికీ జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు
 • ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు
 • ఇలా మోసాలు చేస్తున్నవాళ్లు, అబద్ధాలు చెప్పేవాళ్లు రేపు ఏం చెబుతారంటే.. ఇంటికి మూడు కిలోల బంగారం కావాలంటే, ఇంటింటికీ విమానం కావాలంటే, కారు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటారు
 • ఇలా అబద్ధాలు చెప్పేవాళ్లను నిలదీసే పరిస్థితి రావాలి
 • ఈ పోరాటం ఆగదు.. రాబోయే రోజుల్లో కూడా కొనసాగిద్దాం, మరింత గట్టిగా కొనసాగిద్దాం
 • అలా ముందుకు తీసుకెళ్తేనే ప్రత్యేక హోదా ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది
 • పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరుతున్నా
 • మీ అందరి అభిమానాలకు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. 
Share this article :

0 comments: