చంద్రబాబును ఎవరూ కాపాడలేరు: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబును ఎవరూ కాపాడలేరు: అంబటి

చంద్రబాబును ఎవరూ కాపాడలేరు: అంబటి

Written By news on Monday, August 29, 2016 | 8/29/2016

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎవరూ కాపాడలేరని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్ని సాక్ష్యాధారాలతో కోర్టును ఆశ్రయించారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోది, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నా ఈ కేసు నుంచి చంద్రబాబు తప్పించలేరన్నారు.

త్వరలో ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు బయటకు రాబోతున్నాయని అంబటి రాంబాబు అన్నారు. గతంలో ఈ కేసులో చంద్రబాబును రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. ప్రతిఫలంగా  ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని అంబటి ధ్వజమెత్తారు. ఈ కేసు జరిగిన 14 నెలలు గడిచినా తెలంగాణ ప్రభుత్వం అదనపు ఛార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఇక ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నలకు ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని అంబటి అన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు పోరాటం చేసినా తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు సేవా కార్యక్రమాల్లో  పాల్గొవాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: