మహిళలని కూడా చూడకుండా పైశాచికంగా ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహిళలని కూడా చూడకుండా పైశాచికంగా ...

మహిళలని కూడా చూడకుండా పైశాచికంగా ...

Written By news on Tuesday, August 2, 2016 | 8/02/2016


మహిళలపై పోలీసు మార్కు పైశాచికత్వం!వీడియోకి క్లిక్ చేయండి
తిరుపతి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం నిర్వహిస్తున్న బంద్‌ను విఫలం చేయడానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నించారు. అందులో భాగంగా మహిళల పట్ల పైశాచికంగా వ్యవహరించారు. తిరుపతిలో ధర్నా చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో భాగంగా ఆయనకు అడ్డుగా ఉన్న మహిళా కార్యకర్తల పట్ల పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. అనంతరం భూమనను బలవంతంగా అక్కడి నుంచి ముత్యాలరెడ్డిపల్లి పోలీసు స్టేషన్ వద్దకు తరలించారు. స్టేషన్ ఆవరణలో ఉన్న భూమన.. అక్కడే మీడియాతో మాట్లాడుతుండగా వీడియో కెమెరాలను సైతం అక్కడి నుంచి లాగేసి, కెమెరా లెన్సులకు చేతులు అడ్డుపెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ మొత్తం వ్యవహారంపై కరుణాకర రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధించే ప్రయత్నంలో భాగంగా తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే చంద్రబాబు నాయుడి పోలీసులు తమను కొట్టారని ఆయన చెప్పారు. మహిళలని కూడా చూడకుండా పైశాచికంగా వాళ్ల చీరలు పట్టుకుని లాగి, జాకెట్లు చించి, ఎక్కడపడితే అక్కడ తన్నారని, గొలుసులు కూడా తెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నడిరోడ్డులో అంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించారో చెప్పుకోడానికి సిగ్గుగా ఉందన్నారు. ప్రజా ఉద్యమకారుల మీద ఇంత దారుణంగా ప్రవర్తించాలని చంద్రబాబు ఎలా చెప్పారో తెలియడం లేదని.. ఒక్క ఓటుకు నోటు కేసునుంచి  బయటపడేందుకు వాళ్ల దగ్గర సాగిలపడి ఇలా చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పుడు వేంకటేశ్వర స్వామి పాదాలసాక్షిగా తాము అనుభవజ్ఞులమని, హోదా తెస్తామని చెప్పారని, కానీ ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఆ మాట మర్చిపోయారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికి మోదీని రెండుసార్లు కలిశారని, జాతీయ నాయకులకు కూడా హోదా ప్రయోజనాలు, దాని అవసరం గురించి తెలిపారని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశారని గుర్తు చేశారు.

అయినా కూడా నిండు సభలో రాష్ట్రానికి హోదా ఇచ్చేది లేదని చెప్పడంతో ఆవేదన చెంది రోడ్ల మీదకు వచ్చిన ప్రజాస్వామ్య వాదుల పట్ల ఇప్పుడు ఇంత నిర్దయగా, అమానుషంగా ఎలా ప్రవర్తించారో తెలియడం లేదని.. ఇలాంటి సందర్భం ఇంతకుముందు ఎప్పుడూ లేదని కరుణాకర రెడ్డి అన్నారు. దేశమంతా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ప్రాణాలు కూడా అర్పిస్తామని ప్రజలు చెబుతున్నారని, కానీ చంద్రబాబు మాత్రం తనకు.. తన కుమారుడికి పదవుల కోసం ఎంతటి అరాచకానికైనా పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పాఠం చెప్పినట్లు ప్రత్యేకహోదా సంజీవని కాదని చెబుతున్నారని, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దేశంలో అత్యంత నీచరాజకీయం చేస్తున్నది చంద్రబాబు మాత్రమేనని ప్రపంచానికి తేటతెల్లం చేస్తున్నారని అన్నారు. నాయకులు, కార్యకర్తలందరినీ ఎక్కడపడితే అక్కడ కొట్టడం, అరెస్టులు చేయడం దారుణమని తెలిపారు.

భూమన కరుణాకరరెడ్డి అలా మాట్లాడుతుండగానే ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్న 'సాక్షి' కెమెరాను పోలీసులు అక్కడి నుంచి లాగేశారు. కెమెరా లెన్స్‌కు చేతులు అడ్డుపెట్టి, కెమెరామన్‌ను అక్కడి నుంచి లాక్కెళ్లిపోయారు.
Share this article :

0 comments: