వైఎస్ విగ్రహమే అడ్డుగా ఉందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ విగ్రహమే అడ్డుగా ఉందా?

వైఎస్ విగ్రహమే అడ్డుగా ఉందా?

Written By news on Monday, August 1, 2016 | 8/01/2016


వైఎస్‌ను ప్రజల గుండెల్లోంచి తొలగించగలరా?
సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేతల మండిపాటు
సాక్షి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను తొలగించగలరేమో కానీ, ప్రజల గుండెల్లోంచి ఆయనను తీసివేయలేరని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. విజయవాడ పోలీసు కంట్రోల్‌రూమ్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా, నగర అధ్యక్షులు కె.పార్థసారథి, వంగవీటి రాధాకృష్ణ, అధికార ప్రతినిధి జోగి రమేష్, ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, రక్షణ నిధి, మేకా ప్రతాప్ అప్పారావు తదితరులు కలెక్టర్ అహ్మద్‌బాబును కలిసి వినతి పత్రం అందచేశారు.

విగ్రహం కూల్చిన ప్రదేశం పక్కనే కొంత స్థలం కేటాయిస్తే తాము తిరిగి విగ్రహం ప్రతిష్ఠించుకుంటామని కోరారు. పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని నేతలు నిర్ణయించగా పోలీసులు అనుమతించలేదు. కలెక్టర్‌ను కలవడానికి ముందు ఆయన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
వైఎస్ విగ్రహమే అడ్డుగా ఉందా?

వైఎస్ విగ్రహం ట్రాఫిక్‌కు ఏమాత్రం అడ్డుగా లేదని, ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే తొలగించినట్లు పోలీసులు చెబుతున్నారని కె.పార్థసారథి తెలిపారు. పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుష్కరాలకు వచ్చే భక్తులు రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని చూసి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుకు తెచ్చుకుంటారనే దుగ్ధతోనే దాన్ని కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: