న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై లోక్ సభలో వైఎస్సార్ సీపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టారు. ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీలు చర్చకు డిమాండ్ చేశారు. పోడియం వద్దకు వెళ్లి 'న్యాయం చేయాలంటూ' నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.
దీనిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దని, జీరో జీవర్ లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని హామీయిచ్చారు. స్పీకర్ హామీతో సంతృప్తి చెందని వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. టీడీపీ ఎంపీలు తమ స్థానాల వద్దే నిలబడి నినాదాలు చేశారు. దళితులపై దాడుల అంశంపై చర్చకు పట్టుబట్టడంతో రాజ్యసభలోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

0 comments:
Post a Comment