లోక్ సభ నుంచి వైఎస్సార్ సీపీ వాకౌట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లోక్ సభ నుంచి వైఎస్సార్ సీపీ వాకౌట్

లోక్ సభ నుంచి వైఎస్సార్ సీపీ వాకౌట్

Written By news on Thursday, August 4, 2016 | 8/04/2016


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై లోక్‌ సభలో వైఎస్సార్ సీపీ ఎంపీలు వరుసగా నాలుగో రోజూ ఆందోళన కొనసాగించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోక్ సభలో నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తగా జీరో అవర్ మాట్లాడాలని స్పీకర్ సుమిత్రా మహాజన సూచించారు.

ప్రత్యేక హోదా తక్షణం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే 26 నెలలు గడిచిందని, ఇంకా కాలయాపన చేయొద్దన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వైఎస్సార్ సీపీ ఎంపీలు లోక్ సభ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీలు వాకౌట్ చేశారు.
Share this article :

0 comments: