వైఎస్సార్ సీపీలోకి కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీలోకి కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు

వైఎస్సార్ సీపీలోకి కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు

Written By news on Saturday, August 6, 2016 | 8/06/2016


వైఎస్సార్ సీపీలోకి కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
హైదరాబాద్: కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీవై రామయ్య శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామయ్యతో పాటు పలువురు నేతలు కూడా వైఎస్సార్ సీపీలోకి వచ్చారు.  వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ... జనమంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైఎస్సార్ సీపీలో చేరారని చెప్పారు. కర్నూలు జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా జనం మత్రం జగన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని గౌరు వెంకటరెడ్డి అన్నారు. రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ సీపీదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: