హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సంజీవిని కాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అనడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ....ఏపీకి ప్రత్యేక హోదా ముమ్మాటికీ సంజీవనేనని చెప్పారు.
రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నది వెంకయ్యనని అంబటి గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు పాడిన పాటను...ఇప్పుడు వెంకయ్య అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల ఆగ్రహంతో బాబు నోటికి ప్లాస్టర్ వేసుకున్నారని...వెంకయ్య కూడా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. ఏపీకి ప్యాకేజీ పేరుతో కేంద్రప్రభుత్వం మోసం చేస్తామంటే ప్రజలు సహించరని అన్నారు. చంద్రబాబుకు పోగాలం దాపురించిందని...శిషుపాలుడికి పట్టిన గతే బాబుకు పడుతుందని అంబటి అన్నారు.

0 comments:
Post a Comment