అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మేకపాటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మేకపాటి

అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మేకపాటి

Written By news on Tuesday, August 2, 2016 | 8/02/2016

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు లోక్ సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి లోక్ సభలో తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని వేరే బిల్లు పై చర్చ అయినా ఎపి ప్రత్యేక హోదా, ఫిరాయింపుల సమస్యపై తెలివిగా మాట్లాడారు.
రికవరీ ఆఫ్ డెట్స్ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ప్రభుత్వాలు పార్లమెంటులో ఇచ్చిన హామీలనే అమలు పరచకపోతే, ఈ బిల్లులు తెచ్చి ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ ను సమర్దిస్తూనే ఎపికి ప్రత్యేక హోదాపై గత ప్రధాని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రధాని మోడీ తిరుపతి సభలో హోదా గురించి హామీ ఇచ్చారని, బిజెపి ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిందని మేకపాటి గుర్తు చేశారు.మనం చేసుకున్న చట్టాలకు, హామీలకు కట్టుబడి లేనప్పుడు అవి చేసుకుని ఏం లాభం? ఉదాహరణ కు అంటూ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం చూడండి అని తను చెప్పదలిచింది చెప్పారు.పదో షెడ్యూలుకు సంబందించిన ఫిరాయింపుల వ్యతిరేక చట్టానిదీ అదే దుస్థితి ,అని స్పీకర్ లు ఫిరాయింపుదారులపై చర్యలు తీసకోకపోతే ఎలా అని ప్రశ్నించారు.
http://kommineni.info/
Share this article :

0 comments: