నిధుల కేటాయింపుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అసంతృప్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిధుల కేటాయింపుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అసంతృప్తి

నిధుల కేటాయింపుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అసంతృప్తి

Written By news on Tuesday, August 2, 2016 | 8/02/2016

నిధుల కేటాయింపుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అసంతృప్తి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ఏర్పాటుపై ప్రవేశపెట్టిన బిల్లును సోమవారం రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించడంతో పార్లమెంట్ ఆమోదం లభించినట్లయింది. బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ఉన్నత విద్యా సంస్థలకు అరకొర నిధులు కేటాయించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏపీలో ఎన్‌ఐటీని ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఉన్నత విద్యాసంస్థను నెలకొల్పేటప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంద న్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థల ఏర్పాటు కు రూ. 1,200 కోట్ల నుంచి 2,500 కోట్లు అవసరమైతే నామమాత్రపు నిధులిచ్చి చేతులుదులుపుకునేలా వ్యవహరించారని విమర్శించారు.

2015-16 బడ్జెట్‌లో ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఎస్ ఈఆర్‌లకు నామమాత్రంగా రూ. 40 కోట్ల చొప్పున, కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన యూనివర్సిటీ, పెట్రోలియం వర్సిటీలకు కేవలం రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. 2016-17లో కూడా దాదాపుగా ఇవే మొత్తాలను కేటాయించారన్నారు. ఈ విధంగా బడ్జెట్ కేటాయింపులు జరిపితే ప్రాజెక్టులు పూర్తవడానికి ఎంత కాలం పడుతుందని విజయసాయిరెడ్డి నిలదీశారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో స్థానిక విద్యార్థులకు 85% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: