కేంద్రంపై పోరాడాల్సింది పోయి.. బిచ్చమేస్తే తీసుకుంటావా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రంపై పోరాడాల్సింది పోయి.. బిచ్చమేస్తే తీసుకుంటావా?

కేంద్రంపై పోరాడాల్సింది పోయి.. బిచ్చమేస్తే తీసుకుంటావా?

Written By news on Saturday, August 20, 2016 | 8/20/2016

కేంద్రంపై పోరాడాల్సింది పోయి.. బిచ్చమేస్తే తీసుకుంటావా? : అంబటి
 పునర్విభజన చట్టం కల్పించిన హక్కుల సాధనకు పోరాడాల్సిందిపోయి.. కేంద్రం భిక్షం వేస్తోంటే ఆంధ్రప్రదేశ్ బిచ్చగాళ్ల సంఘం అధ్యక్షుడిలా సీఎం చంద్రబాబు తీసుకోవడం ఏమిటని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. కేంద్రమిచ్చిన నిధుల్ని సక్రమంగా వినియోగించట్లేదంటూ వినియోగ ధ్రువీకరణ పత్రాల(యూసీలు)పై నీతిఆయోగ్ అనుమానం వ్యక్తపరుస్తూ.. తనపై అవినీతిపరుడిగా ముద్రవేసినా చంద్రబాబు నోరెందుకు పెగలట్లేదని ప్రశ్నిం చారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకోసం.. రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం రాష్ట్రప్రజల గుండెల్ని తొలచివేస్తోందన్నారు.
విభజన చట్టంలోని హక్కులకోసం సీఎం చంద్రబాబు పోరాడితే వైఎస్సార్‌సీపీ మద్దతిస్తుందన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం రూ.1,976 కోట్ల సాయం ప్రకటించిందని.. ఇదిచూసి ఆనందపడాలో, బాధపడాలో అర్థమవని పరిస్థితి నెలకొందన్నారు.బాబులా స్వప్రయోజనాలకోసం రాష్ట్రప్రజల ప్రయోజనాల్ని తాకట్టుపెట్టే సంస్కృతి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికుంటే.. ఆయన జైలుకెళ్లి ఉండేవారే కాదన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2014-15లో రూ.1,500 కోట్లు, 2015-16లో రూ.550 కోట్లు, ప్రస్తుతం రూ.450 కోట్లు.. వెరసి రూ.2,500 కోట్లే ఇచ్చిందన్నారు.  రెవెన్యూలోటు భర్తీకింద రూ.3,979 కోట్లే ఇచ్చిందన్నారు.
 రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీమేరకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలంటూ ఆదినుంచీ వైఎస్సార్‌సీపీ పోరాడుతోందని అంబటి గుర్తుచేశారు.
Share this article :

0 comments: