ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్‌ జగన్‌ అభినందనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Written By news on Sunday, August 28, 2016 | 8/28/2016


ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్‌ జగన్‌ అభినందనలు
హైదరాబాద్‌: ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఏటీవీ రాకెట్‌ ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్త్‌లోనూ ఇలాంటి ప్రయోగాలు మరిన్నో విజయవంతం కావాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

కాగా, నెల్లూరు జిల్లాలోని ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 6 గంటలకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెహికిల్‌ (ఏటీవీ) ప్రయోగం ప్రారంభమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు 60 సెకన్లలోపే ఈ ప్రయోగాన్ని పూర్తిచేయగా, ఏటీవీ తొలి 5 సెకెన్లలోపే 70 కిలోమీటర్ల లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఆ తర్వాత కూస్టింగ్ దశలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో ఏటీవీ రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: