బ్రిటిష్ వారు ఇచ్చినప్పుడు స్వాతంత్ర్యం తీసుకుందామనే వారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బ్రిటిష్ వారు ఇచ్చినప్పుడు స్వాతంత్ర్యం తీసుకుందామనే వారు

బ్రిటిష్ వారు ఇచ్చినప్పుడు స్వాతంత్ర్యం తీసుకుందామనే వారు

Written By news on Tuesday, August 2, 2016 | 8/02/2016


హోదాపై రాజీపడే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్
హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై రాజీపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. హోదా కోసం చేపట్టిన రాష్ట్రబంద్ విజయవంతమైందని ఆయన తెలిపారు. బంద్ లో పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కొన్ని శక్తులు అడ్డుకోవాలని చూసినా బంద్ విజయవంతమైందన్నారు.

బంద్ లో పాల్గొన్న సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాలకు వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. లాఠీ దెబ్బలను లెక్క చేయకుండా అక్కచెల్లెమ్మలు బంద్ లో పాల్గొన్నారన్నారు. చంద్రబాబు దగ్గరుండి ప్రజలపైకి పోలీసులను ఉసిగొల్పారని వైఎస్ జగన్ అన్నారు. బంద్ ను అడ్డుకునేందుకు చంద్రబాబు యత్నించారన్నారు. హోదాకు అనుకూలమైతే బంద్ లో పాల్గొన్నవారిని ఎందుకు అరెస్ట్ చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. హోదాపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా పోరాటం చేయాల్సి రావటం దురదృష్టకరమన్నారు.

ప్రత్యేక హోదా కోసం తాము ఎన్నో రకాల పోరాటాలు చేశామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చివరికి హోదా కోసం నిరవధిక దీక్ష కూడా చేశామన్నారు. 8 రోజుల నిరవధిక దీక్ష చేస్తే రాష్ట్రానికి మోదీ వస్తున్నారని దీక్షను భగ్నం చేశారని ఆయన తెలిపారు.  స్వాతంత్ర్య పోరాట సమయంలో చంద్రబాబు ఉండుంటే బ్రిటిష్ వారు ఇచ్చినప్పుడు  స్వాతంత్ర్యం తీసుకుందామనే వారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం ఏమైనా సంజీవనా అని చంద్రబాబు మాట్లాడేవారని, మన అదృష్టం ఏంటంటే అప్పుడు చంద్రబాబు లేకపోవడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉండటం మన కర్మ అన్నారు.

పథకం ప్రకారమే చంద్రబాబు ప్రత్యేక హోదాను నీరుగారుస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుకు బుద్ధి చెప్పే  పరిస్థితి వస్తుందన్నారు.  ప్రత్యేక హోదాపై తాము రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రత్యేక హోదా మన హక్కు అని, హోదా ఇస్తామని చెప్పి కేంద్రంలో ఉన్న అధికార, ప్రతిపక్షం రాష్ట్రాన్ని విడగొట్టాయన్నారు. హోదా వస్తే విపరీతమైన పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని తెలిసి హోదాను కాలరాస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 
హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతున్నామని, ఇంకా కొనసాగిస్తామన్నారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు మరచిపోవచ్చేమో కానీ, అయిదుకోట్లమంది ప్రజలు మరచిపోరని అన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ అడిగామన్నారు. ప్రధాని అపాయింట్ మెంట్ ఇస్తారో లేదో తెలియదని, రాష్ట్రపతి అయితే అపాయింట్ మెంట్ ఇస్తారన్నారు.
Share this article :

0 comments: