♦ విజయవాడ పున్నమి ఘాట్‌లో
♦ పుష్కర స్నానం, ప్రత్యేక పూజలు
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ బుధవారం తెలిపారు. విజయవాడ నగరంతోపాటు కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన సాగుతుందని వివరించారు. హైదరాబాద్ నుంచి ఉదయం గన్నవరం విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారని.. అక్కడినుంచి నేరుగా విజయవాడ పున్నమిఘాట్‌లో ఉన్న వీఐపీ ఘాట్‌కు వెళ్లి పుష్కర పుణ్యస్నానమాచరించి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు.

పుష్కర స్నానాలకెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ
ఇదిలా ఉండగా కృష్ణా జిల్లాలో మంగళవారం పుష్కర స్నానాలకెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శిస్తారని, ఇందులో భాగంగా నందిగామ నియోజకవర్గంలో పర్యటిస్తారని రఘురామ్ తెలిపారు. అక్కడినుంచి జగన్ తిరుగుపయనమై హైదరాబాద్ చేరుకుంటారని రఘురామ్ వివరించారు.

0 comments:
Post a Comment