క్రైం నెంబరు 11 విచారణపై ఎలాంటి స్టే లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » క్రైం నెంబరు 11 విచారణపై ఎలాంటి స్టే లేదు

క్రైం నెంబరు 11 విచారణపై ఎలాంటి స్టే లేదు

Written By news on Friday, September 2, 2016 | 9/02/2016


హైదరాబాద్ :
ఏసీబీ కోర్టు జారీచేసిన మెమోపై మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చింది తప్ప క్రైం నెంబరు 11 విచారణపై ఎలాంటి స్టే లేదని.. అందువల్ల తెలంగాణ ఏసీబీ తన కేసు విచారణను కొనసాగించుకోవచ్చని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కేసు పెండింగ్‌లోనే ఉంటుందని, కేసు విచారణకు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని మరో సీనియర్ న్యాయవాది అరుణ్‌కుమార్ తెలిపారు. హైకోర్టు ఇచ్చినది కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని ఆయన అన్నారు.

చంద్రబాబు ఎప్పటినుంచో మాయమాటలు చెబుతూనే ఉన్నారని, కేసు దాఖలు చేసేటప్పుడే తాము చంద్రబాబును స్టేకు వెళ్లొద్దని చెప్పామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. విచారణను ఎదుర్కోవాల్సిందిగా సవాలు చేశామన్నారు. విచారణలో నిర్దోషివని తేలితే ప్రజలందరికీ కడిగిన ముత్యానివే, నిప్పువే అని తెలుస్తుందని చెప్పామని ఆయన అన్నారు. కానీ.. దోషిగా తేలితే భవిష్యత్తు తన దెబ్బతింటుందనే భయంతోనే చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారని ఆయన తెలిపారు. అసలు ఏసీబీని ఆశ్రయించడానికి తనకు అర్హత లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది అన్నారని.. కానీ న్యాయస్థానం మాత్రం తనను అనర్హుడిగా ప్రకటించలేదు, ఆయనను శాశ్వతంగా ఈ కేసు నుంచి బయట పడేయలేదని గుర్తు చేశారు. కేవలం ఏసీబీ కోర్టు మెమోపై 8 వారాలు మాత్రమే స్టే ఇచ్చిందని అన్నారు. ఈ స్టే వెకేట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హైకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. తాము సమర్పించిన సాక్ష్యాలు సరైనవేనని భావించడం వల్లే ఏసీబీ కోర్టు తెలంగాణ ఏసీబీని కేసు పునర్విచారణకు ఆదేశించిందని ఆర్కే గుర్తుచేశారు.
Share this article :

0 comments: