
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ఎన్ ఆర్ ఐలతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 25న నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారితో ఆయన ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడనున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న బీజేపీ, టీడీపీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను దారుణంగా వంచించినందున వైఎస్ జగన్ రాష్ట్రానికి హోదాపై పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెగేసి చెబితే.. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించడంపై ఏలూరులో జరిగిన యువభేరిలోనూ ఈ అంశంపై సీఎంను ప్రశ్నించారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని యువభేరిలో నిలదీసిన వైఎస్ జగన్.. ప్రత్యేక హోదాపై పోరాటంలో ఎన్ఆర్ఐలను భాగస్వాములు చేయాలని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించి వీడియో లింక్ https://www.youtube.com/channel/UC4oQR_IibE2AK_h78czulrQ ద్వారా వీక్షించవచ్చు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించి వీడియో లింక్ https://www.youtube.com/channel/UC4oQR_IibE2AK_h78czulrQ ద్వారా వీక్షించవచ్చు.
0 comments:
Post a Comment