- 27న అనంత కలెక్టరేట్ ఎదుట ధర్నా
- 28న కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర
- 28న కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో రైతులు కరవు కోరల్లో చిక్కి విలవిల్లాడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని, కరువు నివారణ కోసం కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ విషయంలో చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా పోరాటాలకు సన్నద్ధమయ్యారు.
రైతు సమస్యలపై స్పందించేలా సర్కారు మెడలు వంచేందుకు వైఎస్ జగన్.. ఈ నెల 27 న అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నారు. అనంతరం 28న కర్నూలులో రైతు భరోసా యాత్రను నిర్వహించనున్నారు. కరువు, ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈమేరకు వైఎస్సార్ సీపీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు.

0 comments:
Post a Comment