రక్షకతడి లెక్కలన్నీబూటకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రక్షకతడి లెక్కలన్నీబూటకం

రక్షకతడి లెక్కలన్నీబూటకం

Written By news on Wednesday, September 7, 2016 | 9/07/2016

)
రక్షకతడి లెక్కలన్నీబూటకం
= దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
=  బీమా విషయంలో ప్రభుత్వం, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలను కోర్టుకీడుస్తాం
= రైతులు, జిల్లా ప్రజల సంక్షేమాన్ని సమాధి చేసేలా ప్రభుత్వ చర్యలు
= రక్షకతడి, ప్రభుత్వ మోసంపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం
= వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి


(సాక్షి ప్రతినిధి, అనంతపురం) : చంద్రబాబు ప్రభుత్వం సత్యదూరమైన చర్యలతో  రైతులకు అంతులేని మోసం చేస్తోందని, రక్షకతడి లెక్కలన్నీ బూటకమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో కరువొచ్చినప్పుడు రైతులకు ఇన్‌పుట్‌æసబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఇచ్చిన ప్రభుత్వాలను చూశా. కానీ వాటిని ఎగ్గొట్టేందుకు ‘రక్షకతడి’పేరుతో ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఇప్పుడే చూస్తున్నా. 2014–15, 15–16 లోనూ జిల్లాకు కరువొచ్చినా రూపాయి కూడా ఇన్‌ఫుట్‌సబ్సిడీ, ఇన్సురెన్స్‌ ఇవ్వలేదు.


ఈ ఏడాదీ ఎగ్గొట్టేందుకు చూస్తున్నారు. రెయిన్‌గన్‌లను తెచ్చి రాజకీయంగా, రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారు. ‘అనంత’లో 2.25 లక్షలు, ‘సీమ’లో 4 లక్షల ఎకరాల వేరుశనగకు ఒక తడి ఇచ్చామని, వా రంలో రెండోతడి ఇస్తామని చెబుతున్నారు. ‘సీమ’ లో 22 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేశారు. ఇందులో జూన్‌లో 50శాతం పంట వేశారు. వర్షంలేక 40 రోజులు  బెట్టకట్టింది.  తల్లివేరు పూర్తిగా దెబ్బతింది. ఎక్కడా కాయలు లేవు.  రక్షకతడి ద్వారా పంటను కాపాడామంటున్నారు.  4లక్షల ఎకరాలకు  8–10 టీఎంసీల నీరు అవసరం. ఆరు రోజుల్లో ట్యాంకర్లు, బోర్ల ద్వారా ఇన్ని నీళ్లు ఇవ్వడం సాధ్యమేనా?ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండని సీఎం అనడం...ఐఏఎస్, గ్రూపు–1అధికారులు కూడా జీహుజూర్‌ అన్నట్లుగా ‘రక్షకతడి’ వ్యవహారాన్ని నడిపించారు. 


మీ లెక్కల ప్రకారం ఆలోచించినా పదివేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్లు వాడితే 28 లక్షల ట్రిప్పుల ద్వారా ఒక టీఎంసీ నీళ్లు ఇవ్వొచ్చు. రోజుకు ఒక వాహనం 10 ట్రిప్పులు తోలినా 2.80 లక్షల వాహనాలు కావాలి. ఇన్ని తెచ్చారా?   ఏ గ్రామంలో, ఏ సర్వే నెంబర్‌లో, ఏ రైతుకు నీళ్లిచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. జూలై 21న రెయిన్‌గన్‌లు జిల్లాకు చేరినా ఆగస్టు 28వరకూ ఉపయోగించకపోవడం నేరం కాదా? డ్యాష్‌బోర్డు ద్వారా అన్నీ తెలుసుకుంటానని చెప్పే సీఎంకు వర్షం సంగతి, పంట ఎండిన విషయం తెలీదా? పైగా ఏదోసాధించినట్లు విక్టరీ సింబల్‌ చూపించి వెళ్లారు.

ఇది జిల్లా వినాశనానికి నాంది. చంద్రబాబు  2004కుముందు భయంకర కరువులోనూ ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వలేదు.  ఇప్పుడూ ఎగ్గొట్టేందుకు సిద్ధమయ్యారు.  ఇన్సూరెన్స్‌లోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. పంట కాలాన్ని మూడు విడతలుగా చేశారు. మొదటివిడత వర్షాలు లేకపోతే బులెటిన్‌ విడుదల చేసి వారంలోపు బీమా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలి. రెండో విడతలోనూ ఇలాగే చేయాలి. మూడో విడతలో దిగుబడిని లెక్కించి ఇవ్వాలి. తక్కువగా బీమా కంపెనీ ఇస్తే ఆ మొత్తాన్ని ఇన్‌పుట్‌సబ్సిడీ ద్వారా ప్రభుత్వం ఇవ్వాలి. బీమా భిక్షకాదు..రైతుల హక్కు.


ఈ ఏడాది బీమా ఇవ్వకపోతే బ్యాంకులు, ప్రభుత్వం, బీమా సంస్థలను కోర్టుకీడుస్తాం. మానహక్కుల వేదికకు వెళ్తాం. అన్ని రాష్ట్రాలలో  ప్రధానపంటను ఫసల్‌బీమాలో చేరిస్తే,  ఇక్కడ మాత్రం వేరుశనగను చేర్చలేదు. ‘సీమ’లో 39.50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. బ్యాంకర్లు దాదాపు అన్ని పంటల రుణాలు, ప్రీమియానికి వేరుశనగ అని రాశారు. వేరుశనగకు బీమా రాదు. మరి కంది, పత్తి, ఆముదం, జొన్నతో పాటు వేరే పంటలు వేసిన రైతుల పరిస్థితేంటి? టీడీపీలో  ఏడుసార్లు గెలిచి మంత్రులుగా చేసి, గుంతకు కాళ్లు ఈడ్చుకున్నవారు ఉన్నారు. వీరి స్వార్థం కోసం అన్యాయాన్ని ప్రశ్నించడం లేదు. ఈక్రమంలో రైతు, ప్రజాసంఘాలు, మేధావులు కలిసి ప్రశ్నించాల్సిన అవసరముంద’ని అన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, పార్టీ నేత ఆకులేడు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: