ఎల్లుండి ఏపీ బంద్: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎల్లుండి ఏపీ బంద్: వైఎస్ జగన్

ఎల్లుండి ఏపీ బంద్: వైఎస్ జగన్

Written By news on Thursday, September 8, 2016 | 9/08/2016


ఎల్లుండి ఏపీ బంద్: వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఎల్లుండి(శనివారం) రాష్ట్ర బంద్ కు ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. బంద్ ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఏవిధంగా అన్యాయం చేశారో అదేవిధంగా ఇప్పుడు అన్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా తెలిపారన్నారు. జైట్లీ, చంద్రబాబు కలిసి ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు వస్తాయని, ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం ఉండదని జగన్ వివరించారు. ప్రత్యేక హోదా వస్తేనే వేలకొద్ది పరిశ్రమలు వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ యువత ఆశలపై జైట్లీ నీళ్లు చల్లారని అన్నారు. జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించడాన్ని జగన్ తప్పుబట్టారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్ తో ఆట లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగా శనివారం ఏపీ బంద్ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్ కు సంబంధించి వామపక్ష నాయకులతో మాట్లాడామని వెల్లడించారు. చంద్రబాబు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: