విజయవంతంగా బంద్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయవంతంగా బంద్

విజయవంతంగా బంద్

Written By news on Saturday, September 10, 2016 | 9/10/2016


రాష్ట్రంలో మిన్నంటిన నిరసనలు...
నడవని బస్సులు...తెరుచుకోని వ్యాపార,వాణిజ్య సంస్థలు
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేవలం ప్యాకేజీ ప్రకటించినందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్‌ బంద్ విజయవంతంగా జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపుకు వామపక్షాలు మద్దతు పలకడం, ప్రజలు, వాణిజ్య, వ్యాపార సంస్థల యజమానులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో అన్ని పట్టణాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నడవలేదు. అయితే బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ, వామపక్షాల ముఖ్య నేతలను శుక్రవారం రాత్రి నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. మిగిలిన నేతలను శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పోలీసుల నిర్బంధం ఉన్నా ప్రజలు బంద్ పాటిస్తున్నారు. అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ, వామపక్షాల నేతలను అదుపులోకి తీసుకున్నారు.
Share this article :

0 comments: