నయీమ్ ట్యాక్స్‌లా లోకేశ్ ట్యాక్స్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నయీమ్ ట్యాక్స్‌లా లోకేశ్ ట్యాక్స్

నయీమ్ ట్యాక్స్‌లా లోకేశ్ ట్యాక్స్

Written By news on Saturday, September 17, 2016 | 9/17/2016


నయీమ్ ట్యాక్స్‌లా లోకేశ్ ట్యాక్స్
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపాటు
 
 సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ ట్యాక్స్ వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం లోకేశ్ ట్యాక్స్ నడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. లోకేశ్ అంటేనే అవినీతి అని మండిపడ్డారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయడమేనని, అయితే, అది నెరవేరదని స్పష్టం చేశారు. రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణాలకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు దోపిడీలు, అక్రమాలకే తాము వ్యతిరేకం అని, వాటిని తాము బయటపెడుతుండడంతో ఆయన తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు.  చిత్తశుద్ధితో అభివృద్ధికి కృషి చేస్తే సహకరిస్తామని అన్నారు.   దేశంలో 954 బిలియన్ల పెట్టుబడులు వస్తే, అందులో ఏపీకి 15.6 శాతం పెట్టుబడులు వచ్చాయనడం అర్థరహితమన్నారు.

 కోర్టులపై ఉన్న నమ్మకాన్ని నీరుగార్చొద్దు
 ‘‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి, ఎన్నికలకు వెళ్తే వైఎస్సార్‌సీపీ కావాలా? టీడీపీ కావాలా? అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. వైఎస్సార్‌సీపీ ఉంటే టీడీపీకి పుట్టగతులు ఉండవన్న భయం చంద్రబాబుకు పట్టుకుంది. ఎన్నికలకు వెళ్లే ధైర్యం, చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉందా?  స్విస్ చాలెంజ్ విధానం లోపభూయిష్టంగా ఉందని సుదీర్ఘమైన విచారణ జరిగిన హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇస్తే, దానిపైనా బాబు రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదు. న్యాయస్థానాలపై వ్యాఖ్యలు చేసి, వాటిపై ఉన్న నమ్మకాన్ని నీరుగార్చొద్దు’’ అని అంబటి రాంబాబు హితవు పలికారు.
Share this article :

0 comments: