రేపు ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి

రేపు ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి

Written By news on Wednesday, September 21, 2016 | 9/21/2016


రేపు ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి
ఏలూరు : రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాకు నీళ్లొదిలి ప్యాకేజీకి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్‌ను నాశనం చేసిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం భేరి మోగించేందుకు జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఏలూరులోని శ్రీ కన్వెన్షన్‌ హాల్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి నిర్వహిస్తున్న యువభేరి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆళ్ల నాని ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రత్యేక హోదా రాకపోతే ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయేది యువతేనని.. ఆ విషయాల్ని యువతకు వివరించి పోరాటంలో భాగస్వాములను చేయడం కోసమే యువభేరి కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను విద్యార్థులకు, యువతకు వివరించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 
 
పారిశ్రామిక అభివృద్ధి ఏదీ
చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని స్పష్టంగా చెప్పారని ఆళ్ల నాని గుర్తు చేశారు. ఇప్పటికీ జిల్లా అంతటికీ ఉపయోగపడే ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని, కనీసం శంకస్థాపన కూడా చేయకపోవడం జిల్లా ప్రజలను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 13 జిల్లాల్లో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా వచ్చే అవకాశం లేదన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు మాట తప్పారని, భృతి ఇవ్వకపోయినా ప్రత్యేక హోదా ఇస్తే ఉద్యోగాలు వస్తాయని అందరూ భావించారన్నారు. జిల్లా నుంచి ఏటా వేలాదిమంది విద్యార్థులు చదువు పూర్తిచేసుకుని బయటకు వస్తుంటే.. ఉద్యోగాలు పదుల సంఖ్యలో కూడా లేవన్నారు. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

హోదావల్ల ప్రయోజనాలెన్నో..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, కొత్తగా పరిశ్రమలు రావడం వల్ల మౌలిక సదుపాయాల కల్పనతోపాటు నిర్మాణ పనుల వల్ల బాగా చదువుకున్న వారికే కాకుండా వివిధ రంగాల్లో ఉన్నవారికి కూడా ఉపాధి దొరుకుతుందన్నారు. చత్తీస్‌గఢ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో 60 వేల పరిశ్రమలు వచ్చాయని, అంతకుముందు ఒక్క పరిశ్రమ కూడా లేదని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా గురించి మాట్లాడుతూ మోదీ ప్రధాని అయిన వెంటనే రాష్ట్రానికి ఈ హోదా ప్రకటించారని గుర్తు చేశారు. ఆ తరువాత కేంద్రం పూర్తిగా దీనిపై నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు కేటాయించిందని, రూ.60 వేల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్‌కు వంద కోట్లు కేటాయిస్తే, ఎన్ని సంవత్సరాలకు నిర్మాణం పూర్తవుతుందని ప్రశ్నిం చారు.

పోలవరం ప్రాజెక్ట్‌పై చంద్రబాబుకు ప్రేమ కలగడానికి కారణం నిర్మాణ పనులను అతని బినామీకి కేటాయించడమేనని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, ఆ కేసునుంచి బయట పడేందుకే ప్రత్యేక హోదాను కేంద్రానికి అమ్మేశారని నాని విమర్శించారు. ఏపీకి హోదా ఇస్తే పక్క రాష్ట్రాల వాళ్లు అడుగుతారం టున్న బీజేపీకి ఎన్నికల్లో హామీ ఇచ్చినపుడు ఆ విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఐదేళ్ల హోదా సరిపోదని, పదేళ్లు ఇవ్వాలని పార్లమెంట్‌లో అడిగిన వెంకయ్యనాయుడు ఇప్పుడు మాటమార్చడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఈ మోసాలను ప్రజలకు తెలియజెప్పేం దుకు నిర్వహిస్తున్న యువభేరిని విజ యవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 
Share this article :

0 comments: