ఇంతకంటే బరితెగింపు ఏమైనా ఉందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇంతకంటే బరితెగింపు ఏమైనా ఉందా?

ఇంతకంటే బరితెగింపు ఏమైనా ఉందా?

Written By news on Wednesday, September 7, 2016 | 9/07/2016


ఇంతకంటే బరితెగింపు ఏమైనా ఉందా?
హైదరాబాద్ :
గతంలో ఓటుకు కోట్ల కేసు తెరమీదకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తన మంత్రులను ఢిల్లీకి పంపించి అమిత్‌ షా నుంచి అరుణ్ జైట్లీ వరకు అందరితో చర్చించమని చెప్పారని, దానివల్లే ఆయన ఆ కేసు నుంచి కొంత కాలం బయటపడ్డారని.. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి డ్రామాలే చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి మండిపడ్డారు. అప్పుడుకూడా కేంద్ర నేతలతో తాము చర్చించినది ప్రత్యేక హోదా కోసమేనని టీడీపీ ఎంపీలు కలరింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి ఓటుకు కోట్లు కేసు తెరమీదకు వచ్చిందని.. ఇప్పుడు కూడా చంద్రబాబు మెడలో ఉరితాడు అలాగే ఉంది తప్ప ఆ తాడు ముడి ఊడిపోలేదని కాకాణి అన్నారు. అందుకోసమే ఇప్పుడు మరోసారి ప్రత్యేక హోదా, ప్యాకేజి అంటూ టీడీపీ సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు.

అసలు ప్రత్యేక హోదా గురించి గానీ, ప్యాకేజి గురించి గానీ తనకు ఏమీ తెలియదని, జరుగుతున్నట్లు చెబుతున్న విషయాలేవీ తన దృష్టికి రాలేదని చంద్రబాబు అంటున్నారని చెబుతూ.. ఇంతకంటే బరితెగింపు ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఆమోదయోగ్యమైన ప్యాకేజి వస్తే తప్ప ఢిల్లీ వెళ్లేది లేదంటున్నారని.. మరోవైపు ఎంత వస్తే అంత రాబడదామని చంద్రబాబు అంటున్నట్లుగా మీడియాలో కథనం వచ్చిందని, ఈ డ్రామాలు ఎందుకని నిలదీశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కూడా ఇప్పుడు దానికి అయ్యే వ్యయంలో కేంద్రం వాటను 90 శాతానికి ఒప్పించామని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు దక్కేది హోదానా, ప్యాకేజినా అనే విషయం పక్కన పెడితే, చంద్రబాబు డ్రామాలు ఆడటం ఆంధ్రరాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవడమా కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజితో డబ్బులొస్తే వాటిని ఎలా లూటీ చేయాలని చూస్తున్నారు తప్ప రాష్ట్రానికి దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు.

హోదా వస్తే పారిశ్రామిక రాయితీలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తే ప్రజలు లాభపడతారు తప్ప చంద్రబాబుకు వ్యక్తిగతంగా లాభం ఉండదు కాబట్టి ప్యాకేజితో దోచుకుందామని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి సొంత ప్రయో జనాల కో సం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఇది నిప్పుతో చెలగాటం ఆడటమే అవుతుందని హెచ్చరించారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని గోవర్ధనరెడ్డి అన్నారు. కేంద్రం ఒప్పుకోకపోయినా.. చంద్రబాబు గట్టిగా కృషిచేసి ఈ మాత్రమైనా ప్యాకేజి రాబట్టారని కలరింగ్ ఇవ్వడానికి తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే ప్రయత్నం జరగడం లేదని తెలిపారు. నీతి నిజాయితీలతో వ్యవహరించి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని, అంతేతప్ప టీడీపీ - బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతూ ప్రజలను మోసం చేయొద్దని హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలు చర్చకు రాకూడదనే కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రానికి హోదా సాధించాల్సిందేనని.. అంతవరకు కావాలంటే ఢిల్లీకి వెళ్లనని మొరాయించాలని, ఇంకా కావాలంటే మీ కేంద్రమంత్రులతో రాజీనామా చేయించి పోరాటం చేయాలని చంద్రబాబుకు కాకాణి సూచించారు.
Share this article :

0 comments: