హోదాపై వీధి నాటకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హోదాపై వీధి నాటకం

హోదాపై వీధి నాటకం

Written By news on Saturday, September 3, 2016 | 9/03/2016


హోదాపై వీధి నాటకం
రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టి బాబు ఆడిన డ్రామా
- ‘ఓటుకు కోట్లు’ దర్యాప్తు నేపథ్యంలో కేంద్రంతో కాళ్లబేరం
 
 సాక్షి, హైదరాబాద్:  ‘స్విస్ చాలెంజ్’, ‘ఓటుకు కోట్లు’ వ్యవహారాలలో కోర్టులు ఇస్తున్న తీర్పులతో తలబొప్పికట్టిన సీఎం చంద్రబాబు పరువు కాపాడుకోవడం, ప్రజల దృష్టి మళ్లిం చడం కోసం ప్రత్యేకహోదా పేరుతో హస్తినలో ‘ప్యాకేజీ’అనే వీధినాటకం ఆడిస్తున్నారని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బాబు డెరైక్షన్‌లో కేంద్ర మంత్రి సుజనాచౌదరి నాయకత్వంలో ఢిల్లీలో జరుగుతున్నదంతా ఈ నాట కంలో భాగమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నా యి. రెండున్నరేళ్లుగా చంద్రబాబునాయుడు ఎన్నడూ ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టిన పాపాన పోలేదన్న విషయం అందరికీ తెల్సిం దే. మరోవైపు ప్యాకేజీయే ఇవ్వబోతున్నట్లు కేంద్రం ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి కూడా విదితమే. 

హోదా సంజీవని కాదు అని వ్యంగ్యంగా మాట్లాడిన చంద్రబాబు వైఎస్సార్సీపీ ఉధృత పోరాటాలతో ప్రజలలో భావోద్వేగాలు పెరగడం గమనించి స్వరం మార్చారు. రూ.1.90లక్షల కోట్ల నిధులిచ్చామన్న కేంద్రాన్ని.. ఎక్కడిచ్చారు..? రోడ్లకిచ్చిన నిధులన్నీ కలిపిచెబుతున్నారని హూం కరించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో పునర్విచారణకు ప్రత్యేక కోర్టు ఆదేశించగానే మళ్లీ కేంద్రం ముందు మోకరిల్లారు. ప్రత్యేక హోదా కోసం చర్చలు జరుపుతున్నట్లు బిల్డప్ ఇచ్చా రు. మరోవైపు కేంద్రం కొన్ని ప్రతిపాదనలతో ముసాయిదా తయారు చేసిందని అవన్నీ హోదా కన్నా ఎక్కువగానే ఉంటాయని అనుకూల మీడియాలో ప్రచారం చేయించారు. ఐదుకోట్ల మంది ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టి, కోట్లాది మంది నిరుద్యోగుల భవిష్యత్‌ను బలిపెట్టి చంద్రబాబు ఆడించిన నాటకం ఇది. సుజనా వంటి పాత్రధారులు శతవిధాలుగా శ్రమించినా అది రక్తికట్టలేదు.

 దృష్టి మరల్చేందుకే...: కోర్టు ఆదేశాలతో ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరగబోతోందన్న భయంతో రాష్ర్టప్రభుత్వం తరఫున ప్యాకేజీకి కొన్ని ప్రతిపాదనలు చేసి వాటిని కేంద్రం దృష్టికి తెచ్చే బాధ్యతను సుజనాచౌదరికి సీఎం అప్పగించారని తెలుస్తోంది. తీరా అవన్నీ పాత ప్రతిపాదనలేనని,కొత్తవేవీ లేవని అధికారులంటున్నారు. రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, విభజన చట్టంలోని హామీల అమలుకు ప్రతిపాదనలతో కూడిన ప్రకటనే కేంద్రం ఇచ్చే ప్యాకేజీ అని అధికారవర్గాలంటున్నాయి. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని పట్టుపట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మెట్టుదిగిపోయి ప్యాకేజీ అంటూ ప్రతిపాదనలు సమర్పించడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది.

కేంద్రప్రభుత్వం నుంచి వైదొలుగుతామని, మంత్రుల చేత రాజీనామా చేయిస్తామని... అల్టిమేటమ్ జారీ చేయడంతో పాటు కేంద్రంపై వత్తిడి తీసుకురావడానికి అనేక మార్గాలున్నా వాటిని వదిలేసి రాష్ర్టప్రభుత్వం ఇలా దేబిరించే ధోరణిని ఎంచుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి 1.60 లక్షల కోట్ల రూపాయల నిధులిచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఎక్కడిచ్చారు..? రోడ్లకు ఇచ్చిన నిధులన్నీ కలిపి చెబుతున్నారని, కేంద్రం మనకు అన్యాయం చేసిందని చంద్రబాబు ఈ మధ్య ప్రకటనలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఊరట లభించగానే అలాంటి హూంకరింపులు వదిలేశారు. కేసు నుంచి బైటపడడం కోసమే.. ఏవో కొన్ని ప్రతిపాదనలతో ఓ మెమొరాండం తీసుకుపోయి కేంద్ర మంత్రులతో, బీజేపీ నేతలతో భేటీలు జరిపి హడావిడి చేశారు తప్ప రాష్ట్రానికి మేలు చేయాలన్న చిత్తశుద్ధి లేదని దీనిని బట్టి అర్ధమౌతోందని విశ్లేషకులంటున్నారు.

 రాష్ర్టప్రతిపాదనలకు ఆమోదం ఎక్కడ?
 ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇస్తున్న నిధులను 90 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుండగా రాష్ట్రం 40 శాతం నిధులను భరించాల్సి వస్తోంది. ఇందుకు బదులు కేంద్రమే 90 శాతం నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ విధంగా ఇస్తే  కేంద్రం నుంచి అదనంగా ఏడాదికి 3,000 కోట్ల రూపాయలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీనిని ఐదేళ్ల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. విదేశీ ఆర్థిక సాయం ప్రాజెక్టుల్లో 90 శాతం కేంద్రం భరించాలన్న రాష్ట్ర ప్రతిపాదనను కూడా ముందుగానే కేంద్రం తోసిపుచ్చింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తీసుకోవడానికి అంగీకరించినా రాష్ట్ర విభజన తేదీ నుంచి అయ్యే వ్యయాన్ని మాత్రమే భరిస్తామని, అంతకు ముందు వ్యయం భరించబోమని కేంద్రం పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు నిధులను నాబార్డు ద్వారా సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది. నాబార్డు నుంచి తీసుకునే నిధులను 70% తాము భరించేందుకు, మిగతా 30% రాష్ట్రం భరించేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పారిశ్రామిక రాయితీలను ఇవ్వాలని కోరగా తిరస్కరించింది. అసలు  హోదా వస్తే రాష్ర్టప్రభుత్వం ప్రతిపాదించిన ఇవన్నీ ఆటోమేటిక్‌గా అమలులో ఉంటాయని, కొత్తగా కేంద్రాన్ని అర్ధించనక్కరలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అలాంటి సంజీవని వంటి  హోదాను వదిలేయడం, ఒక్కొ క్క దానికి అడిగి లేదనిపించుకోవడం ఎందుకని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
 
 సర్కారు తప్పిదాలతో నిధులకు ఎసరు...
 పారిశ్రామిక రాయితీల కోసం ఏడాదికి రూ.500 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని రాష్ర్టప్రభుత్వం కోరింది. దీనిపై కూడా కేంద్రం ఇంకా అంగీకారం తెలపలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఏడాదికి జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున ఏడు జిల్లాలకు 350 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం కొనసాగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇది కొత్తదేమీ కాదు.. ఇప్పటికే గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏడు జిల్లాలకు 700 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఆ నిధులను ఆ జిల్లాలకు ఖర్చుచేయనే లేదు. వెనుకబడిన జిల్లాలకు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇచ్చిన 700 కోట్ల రూపాయల్లో ఇప్పటికి కేవలం 14.56 కోట్ల రూపాయలనే ఖర్చు చేసినందున ఈ ఆర్థిక సంవత్సరంలో 350 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించినప్పటికీ కేంద్రం విడుదల చేయలేదని అధికారులు గుర్తు చేస్తున్నారు.

ఇక రాజధానిలో ప్రభుత్వ భవనా ల నిర్మాణాలకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదికను, డిజైన్లను పంపిస్తేనే తదుపరి నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. తాత్కాలిక రాజధాని నిర్మాణాలకు నిధులు ఇవ్వబోమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం ఇచ్చిన 1,050 కోట్ల రూపాయల వినియోగ పత్రాలను పంపించేందుకు వీలుపడని పరిస్థితి నెలకొంది. ఈ నిధులను శాశ్వత రాజధాని భవనాలకు వినియోగించిన తరువాత... ఆ వినియోగ పత్రాలను పంపిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తామన్న రూ.450 కోట్లను కేంద్రం విడుదల చేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం మీద హస్తినలో ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్యాకేజీ నాటకానికి రాష్ట్ర సర్కారు తెరతీసినా రాష్ట్రానికి కొత్తగా ఒరిగేదేమీ లేదని అధికారులు పేర్కొంటున్నారు.
Share this article :

0 comments: