హైకోర్టును ఆశ్రయించడమంటే తప్పు ఒప్పుకున్నట్లే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హైకోర్టును ఆశ్రయించడమంటే తప్పు ఒప్పుకున్నట్లే

హైకోర్టును ఆశ్రయించడమంటే తప్పు ఒప్పుకున్నట్లే

Written By news on Friday, September 2, 2016 | 9/02/2016


హైకోర్టును ఆశ్రయించడమంటే తప్పు ఒప్పుకున్నట్లే
సీఎంపై ఉమ్మారెడ్డి ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో తనపై ఏసీబీ విచారణ జరపరాదని హైకోర్టును ఆశ్రయించడంద్వారా సీఎం చంద్రబాబు తాను తప్పు చేశానని సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్లయిందని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పిటిషన్ వేశారంటేనే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన స్వరం తనదేనని చంద్రబాబే నిర్ధారించుకున్నట్లయిందన్నారు. ఉమ్మారెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గురువారం హడావుడిగా లంచ్‌మోషన్‌ద్వారా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడాన్నిబట్టి దీనిపై ఆయనెంతగా ఆందోళన చెందుతున్నారో అర్థమవుతోందన్నారు.

ఈ కేసు సాంకేతికంగా నిలబడదని, చంద్రబాబు స్వరపరీక్షకోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేటపుడు ఏసీబీ అనుమతి తీసుకోలేదని, అసలిది ఏసీబీ పరిధిలోకే రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోనిది కనుక ఏసీబీ విచారణను నిలిపేయాలని రెండురోజులుగా కొన్ని పత్రికల్లో లీకులొస్తున్నాయన్నారు. గతంలో కూడా చంద్రబాబు ఏ విచారణా జరక్కుండా కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకున్నారని ఉమ్మారెడ్డి అంటూ.. ఏలేరు కుంభకోణంలో ఏవిధంగానైతే విచారణ జరక్కుండా స్టే తెచ్చుకున్నారో, ‘ఓటుకు కోట్లు’ కేసులోనూ అలాగే సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ హైకోర్టుకు వెళ్లడం దురదృష్టకరమని అన్నారు.

 ప్రత్యేక హోదా చర్చలేమిటో వెల్లడించాలి
 ప్రత్యేకహోదా ఇవ్వకపోతే స్నేహపూర్వకంగానే విడిపోతామని చంద్రబాబు బీజేపీకి అల్టిమేటం ఇచ్చినట్లుగా పత్రికల్లో రెండురోజులుగా లీకులొస్తున్నాయని, ఈ వ్యవహారాన్ని అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.
Share this article :

0 comments: