ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టొద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టొద్దు

ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టొద్దు

Written By news on Thursday, September 22, 2016 | 9/22/2016


‘ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టొద్దు’
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వేలం పాట మాదిరిగా చేశాయని ఆంధ్రయూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సాంబిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతపై గురువారం శ్రీ కన్వెన్షన్ హాలులో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన యువభేరిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశాన్ని డబ్బుతో కొలవడానికి వీల్లేదని అదోరకమైన భావన అని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజల నోళ్లు మూయించలేరని అన్నారు.

ప్రత్యేక ప్యాకేజీతో ఎటువంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ కలిపి ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ కు మేలు జరుగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలతో చెలగాటం ఆడడం నిప్పుతో చెలగాటమేనని అన్నారు. ప్రత్యేక హోదా కోసం యువత పోరాడాలని పిలుపునిచ్చారు. హోదా గోదాలో మిగిలిన ఏకైక యోధుడు వైఎస్ జగనేనని, ఆయన నాయకత్వంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రొఫెసర్ సాంబిరెడ్డి కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉపాధి దొరుకుతుందని డాక్టర్ కృష్ణభగవాన్ అన్నారు.
Share this article :

0 comments: