అర్ధరాత్రి ప్రకటన చేశారంటేనే అర్థమవుతోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అర్ధరాత్రి ప్రకటన చేశారంటేనే అర్థమవుతోంది

అర్ధరాత్రి ప్రకటన చేశారంటేనే అర్థమవుతోంది

Written By news on Friday, September 9, 2016 | 9/09/2016


చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాల్సిందే
హైదరాబాద్ :
ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా చెప్పినా.. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు శనివారానికి వాయిదా పడిన తర్వాత ఆయన అసెంబ్లీ కమిటీహాల్లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
 • మొన్న అర్ధరాత్రి నుంచి ఈ డ్రామా జరుగుతోంది
 • ఎక్కడైనా రాష్ట్రానికి లేదా ఒక ప్రాంతానికి మేలు జరిగేదో.. అలాంటి ప్రకటన చేస్తే పగటిపూట చేయాలి
 • అలా అయితే ఎక్కువమందికి తెలుస్తుందని అనుకుంటారు
 • ప్యాకేజి గురించి అర్ధరాత్రి వేళ ప్రకటన చేశారంటేనే.. వీళ్లలో నిజాయితీ లేదని అర్థమవుతోంది
 • అదే అర్ధరాత్రి దాటిన తర్వాత అదే ప్రకటనను మన చంద్రబాబు నాయుడు స్వాగతిస్తే.. ఈ పెద్దమనిషికి ఎక్కడ నిజాయితీ ఉందని అడుగుతున్నా
 • నిజంగా ఆరోజు ఎంత బిల్డప్ ఇచ్చారంటే.. పగలంతా కూడా చంద్రబాబుకు అరుణ్ జైట్లీ ప్యాకేజి వివరాలను పంపారని, ఆయన 17 సార్లు దాన్ని చదివారని, ఆయన ఆమోదం చెప్పిన తర్వాత విదేశాల్లో ఉన్న ప్రధాని దగ్గరకు వెళ్లింది, ఆయన మళ్లీ చంద్రబాబుకు పంపితే ఈయన ఆమోదం తెలిపారని, అరుణ్ జైట్లీ అరగంటలో ప్రకటన చేస్తారని పొద్దుట నుంచి హడావుడి
 • మామూలుగా నేను రాత్రం 9.30 కే పడుకుంటా. ఆరోజు రాత్రి మాత్రం చాలాసేపు మెలకువగా ఉన్నా
 • చివరకు చూస్తే.. ఆయన కొత్తగా ఫలానాది ఇస్తున్నానని ఏమీ చెప్పలేదు.
 • ప్రత్యేకహోదా ఇవ్వబోమని మాత్రం స్పష్టంగా నొక్కి వక్కాణించి చెప్పారు.. అది ఇవ్వకపోవడానికి అబద్ధాలు, కుంటిసాకులు వెతుక్కున్నారు
 • ఇదంతా చంద్రబాబుకు సంబంధించిన కేంద్రమంత్రి సుజనా చౌదరి, వెంకయ్యనాయుడు ఇద్దరినీ కూర్చోబెట్టుకుని చెప్పారు
 • బాబుగారేమో అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నానన్నారు
 • కాదన్నప్పుడు ప్రత్యామ్నాయాన్ని వద్దనలేమని, ఏదీ తీసుకోకపోతే రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన అన్నారు
 • చంద్రబాబు కూడా ప్రత్యేకహోదా ఇవ్వట్లేదన్నప్పుడు సీఎంగా ఉన్నవాళ్లు ఏం చేయాలి.. కేంద్రానికి బుద్ధి వచ్చేలా తన మంత్రులను ఉపసంహరించుకుని పోరాడాలి
 • రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఫలానాది చేస్తామని మాట ఇచ్చి.. ఇప్పుడు కుంటిసాకులు వెతుక్కుని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను ఇవ్వడంలేదని ఎలా చెబుతారని పోరాడాల్సింది పోయి... అర్ధరాత్రి దాటిన తర్వాత స్వాగతిస్తాడా?
 • 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు నాశనం అవుతుంటే.. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాక తిరుగుతుంటే వాళ్ల భవితను నాశనం చేయడానికి ఈయనెవడు?
 • చంద్రబాబు ఎందుకు నిలదీయలేకపోతున్నాడు.. కారణం ఓటుకు కోట్ల కేసు
 • ఏసీబీ కోర్టు ఈయన పాత్రమీద విచారణ చేసి రిపోర్టు దాఖలుచేయాలని ఎప్పుడు ఆదేశించిందో అప్పటినుంచి డ్రామా మొదలైంది
 • వెంటనే చంద్రబాబు కేంద్రంతో బేరసారాలు మొదలుపెట్టారు
 • వాళ్ల కాళ్లు పట్టుకునైనా కేసు కొట్టేయించుకోవాలని అనుకుంటున్నారు
 • ఆయన ఎమ్మెల్యేలను కొనేందుకు కోట్ల రూపాయల నల్లధనం వెచ్చిస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయారు
 • ఆ కేసు నుంచి బయట పడేందుకు 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. యువతను వెన్నుపోటు పొడిచారు
 • తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
 • అసెంబ్లీలో చంద్రబాబును గట్టిగా నిలదీస్తుంటే.. కనీవినీ ఎరుగని పద్ధతిలో టీడీపీ వాళ్లు, స్పీకర్ ఇద్దరూ కలిసి చంద్రబాబు ప్రకటన చేస్తారని చెప్పారు.. ఎన్నిసార్లు ప్రకటన చేస్తారు?
 • రాష్ట్రానికి నష్టం జరిగే అంశంపై చర్చ జరగాల్సింది పోయి.. ప్రతిపక్షం చెబుతున్న మాటలను కూడా తీసుకుని అరుణ్ జైట్లీ గారికి అర్థమయ్యేలా చేయాల్సింది పోయి చివరకు ప్రతిపక్షం చెప్పే విషయాలను కూడా వినే పరిస్థితి లేదు
 • మొదటిసారిగా ఏ ఎమ్మెల్యే సస్పెండ్ కాకపోయినా అసెంబ్లీలో మార్షల్స్‌ను చూడటం మొదటిసారి
 • చంద్రబాబు ఇంత కంటే దారుణంగా స్పీకర్‌ను వాడుకున్నారు
 • తనకు నచ్చని వారి విషయంలో ఆయన దారుణాతి దారుణంగా ప్రవర్తించారు
 • 1989-94 మధ్య ఆలపాటి ధర్మారావు స్పీకర్‌గా ఉన్నప్పుడు కుర్చీ లాగేశారు, మెడపట్టుకుని తోసేశారు
 • 2004-09లో స్పీకర్‌గా ఉన్న దళిత మహిళ కుతూహలమ్మ కన్నీరు పెట్టుకున్నారు
 • 2009-14 గవర్నర్ ప్రసంగిస్తుంటే చంద్రబాబు చేతులు ఊపుతూ గవర్నర్ మీద దాడి చేయించారు
 • రాష్ట్రంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ ఇస్తున్నామని అరుణ్ జైట్లీ చెప్పారు
 • మా రాష్ట్రానికి మీరేమైనా ఫేవర్ చేస్తున్నారా.. ఇది జాతీయ విధానం
 • కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రంలో ఐఐటీ ఉంది, ఐఐఎం ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ఐటీ, ఎయిమ్స్ ఉన్నాయి
 • ఇవేమైనా లేకుండా ఎక్కడైనా ఉన్నాయంటే.. కోటి కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలే
 • దేశంలో 20 ఐఐటీలు, 20 ఐఐఎంలు, 31 ఎన్ఐటీలు ఉన్నాయి 47 సెంట్రల్ యూనివర్సిటీలున్నాయి
 • ఫీజిబులిటీ ఉంటే దుగరాజపట్నంలో పీపీపీ పద్ధతిలో పోర్టు ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందన్నారు
 • ప్రభుత్వరంగ సంస్థలైన సెయిల్, పెట్రోకెమికల్ కాంప్లెక్సుల ఏర్పాటుకు పరిశీలిస్తామని చెప్పారు.. అందులో చేసే ఫేవర్ ఏముంది
 • ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్ఆర్‌ జిల్లా ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తోంది
 • దీనికోసం అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పడం, దాన్ని ఈ పెద్దమనిషి స్వాగతించడం
 • ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు.. వనరుల లోటు ఎవరికి ఉన్నా కూడా దాన్ని భర్తీ చేయడం తన విధానం అని 14వ ఆర్థిక సంఘం చెబుతోంది
 • దీని ప్రకారం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాదు.. 11 రాష్ట్రాలకు వనరుల లోటును భర్తీ చేస్తోంది
 • 22,500 కోట్లు మనకివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అది కూడా 2015 నుంచి 2020 వరకు మాత్రమే
 • 14వ ఆర్థిక సంఘం ప్రత్యేకహోదా ఇవ్వొద్దని చెప్పింది కాబట్టే ఇవ్వట్లేదని జైట్లీ అన్నారు
 • 14వ ఆర్థికసంఘం కమిటీ నివేదికలో ఒక్క పేరాలోనైనా అది ప్రత్యేకహోదా వద్దందని మీరు చూపించగలరా?
 • వాళ్లు కేవలం ప్రత్యేక హోదా ఉన్నా, లేకపోయినా ఎవరికైనా రెవెన్యూలోటును భర్తీ చేయడానికి తేడా చూపించబోమన్నారు తప్ప.. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా చెప్పలేదు
 • 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా తీసేయమని ఎప్పుడూ చెప్పలేదని ఆ సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ స్వయంగా చెప్పారు
 • పోనీ అసలు వేరే రాష్ట్రానికి దేనికీ ఇవ్వట్లేదా అంటే.. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా తీసేసే ఆలోచన ఏమీ లేదని పార్లమెంటు సాక్షిగా మంత్రి సమాధానం ఇచ్చారు
 • పోనీ ఈ ఆర్థికసంఘం చెప్పినది తప్పనిసరిగా పాటించి తీరాలన్న నిబంధన కూడా ఏమీ లేదు
 • దాని ప్రతిపాదనలను ఆమోదించాలా.. వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు
 • ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలని వెంకయ్య నాయుడు ఎందుకంత గట్టిగా అడిగారు, ఇస్తామన్న హామీతోనే రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టారు.. అదంత ముఖ్యమని ఎందుకు అందరికీ అనిపించింది
 • మన నుంచి హైదరాబాద్ నగరం వెళ్లిపోయింది. ఉత్పాదక రంగంలో 70 శాతం, ఐటీలో 98 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆ నగరం లేకపోతే దానికి కాంపన్సేట్ చేయాలి.
 • అందుకే ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు
 • ఆ హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఉంటాయి
 • పన్నుల్లో నూరుశాతం రాయితీ, రవాణా చార్జీల రీయింబర్స్‌మెంట్, వడ్డీరేటు 3 శాతం, కరెంటు చార్జీలు సగం రాష్ట్రానికే ఇవ్వడం.. ఇవన్నీ హోదా లేని రాష్ట్రాలకు లేవు
 • అందుకే వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఈ హోదా కోసం అంత గట్టిగా పట్టుబట్టారు
 • ఇలాంటి ప్రోత్సాహకాలు ఉంటేనే పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల పెట్టుబడులు పెడతారు, వేలల్లో ఉద్యోగాలు వస్తాయి
 • చివరకు ఈవాళ జీఎస్టీ ఆమోదం పొందిన పరిస్థితుల్లో చూస్తే, జీఎస్టీలో కూడా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి
 • పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును నూరుశాతం ఇస్తామని ఇప్పుడేదో కొత్తగా చెప్పినట్లుగా చూపించారు
 • అసలు పునర్విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఎప్పుడో రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రటించారు
 • పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కడుతుందని, అందులో ఎవరూ అనుమానించక్కర్లేదని మన్మోహన్ అప్పట్లో చెప్పారు
 • పోలవరం ప్రాజెక్టు ఖర్చులో రాష్ట్రం ఇంత, కేంద్రం ఇంత పెట్టాలని ఎప్పుడూ చర్చ రాలేదు
 • కేంద్రాన్ని వీళ్లు ఇప్పుడే ఒత్తిడి చేసినట్లు, ఆ తర్వాతే పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడతామంటోందని అన్నట్టుగా చంద్రబాబు, వెంకయ్య నాయుడు చెబుతున్నారు
 • ఏపీలో వెనకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు 50 కోట్లు ఇస్తున్నారట. అది ఏ మూలకు సరిపోతుంది? ఏదో ముష్టి వేసినట్లు వేస్తున్నారు
 • రెవెన్యూలోటును భర్తీ చేస్తామని అన్నారు.. ఇది పునర్విభజన చట్టంలో ముందే లేదా.. అది కాక కొత్తగా ఏం చేస్తున్నారు
 • అంతర్జాతీయ విమానాశ్రయాల అంశం 13వ షెడ్యూలులో లేదా
 • కొత్తగా స్పెషల్ ప్యాకేజి అని మీరు ఏం చెబుతున్నారో.. అవన్నీ ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నవి కావా, దాని ప్రకారం మాకు రావల్సినవి కావా
 • మాకు రావల్సినవే ఇస్తూ .. ఏదో కొత్తగా ఇస్తున్నట్లు పోజులు కొట్టడం ఎంతవరకు ధర్మం
 • ఇలాంటి సీఎం ఉండే ప్రతి నిమిషం ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరగదా
 • చరిత్ర హీనుడిగా మిగిలిపోతావన్న విషయం మర్చిపోవద్దని చంద్రబాబుకు చెబుతున్నా
 • రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.. ఇది మన పోరాటం, మన హక్కు. వదిలేస్తే ఎవరూ పట్టించుకోరు
 • చంద్రబాబు స్వాగతించినా, ఎవరు స్వాగతించినా దీన్ని వదిలే పరిస్థితిలేదు. దీని కోసం పోరాటం చేయాలి
 • కేసీఆర్ వదిలేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు
 • ఎవరూ సాధ్యం కాదనుకున్న రాష్ట్రమే వచ్చినపుడు.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట కోసం పోరాడితే రాదని అనుకోవక్కర్లేదు
 • చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్నంతకాలం ఆలస్యం కావచ్చేమో.. మనం పోరాటం చేసి ఇప్పించుకోవచ్చు
 • ఈవాళో, రేపో, ఒక నెలలోనో వస్తుందని చెప్పను.. పోరాటం ఆపేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు
 • పోరాటంలో ఒక అడుగు ముందుకు వేస్తూ.. బంద్‌కు పిలుపునిచ్చాం
 • చంద్రబాబు చేసిన తప్పులను ఎత్తి చూపించేందుకు ఆయనను ప్రశ్నిస్తున్నాం
 • రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లాలి
 • ప్రతి ఒక్కరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా.. ఇది యువతకు సంబంధించిన అంశం
 • ప్రత్యేక హోదా వస్తేనే జీఎస్టీ మినహాయింపులు, ఆదాయపన్ను మినహాయింపు వస్తాయి
 • ఇవి ఉంటేనే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు.. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి
 • ఈ పోరాటం మన పిల్లల కోసం చేస్తున్నామని మర్చిపోకూడదు
 • రేపు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్‌ను విజయవంతం చేయండి
 • ఈ బంద్‌ను నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తారు
 • నేను నిరాహార దీక్ష చేస్తుంటే.. మోదీ రావడానికి రెండు రోజుల ముందు నన్ను ఎత్తేశారు
 • కానీ రాష్ట్రంలోని ప్రతి ఒక్క అక్కా చెల్లెలు, అన్నాతమ్ముడు అందరినీ కోరుతున్నా
 • రాష్ట్రంలో ఉన్న ప్రతి సంఘం దీనికి మద్దతివ్వాలని కోరుతున్నా
Share this article :

0 comments: