ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి నేడే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి నేడే

ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి నేడే

Written By news on Sunday, September 25, 2016 | 9/25/2016


ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి నేడే
ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై చర్చ
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25వ తేదీ రాత్రి 8.30 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రవాసాంధ్రులతో ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉధృతంగా పోరు సాగుతున్న నేపథ్యంలో జగన్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఐదు చోట్ల నుంచి ఎన్నారైలు జగన్‌తో మాట్లాడే ఈ కార్యక్రమాన్ని సాక్షి టీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అలాగే డిజిటల్ మాధ్యమంలో సాక్షి యూట్యూబ్ చానల్ https://youtu.be/k4kM4PVNt8I ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు. ఎన్నారైలు ఏర్పాటుచేసుకున్నhttp://www.youtube.com/channel/UC4oQR_IibE2AK_h78czulrQ/liveలింకులో కూడా ప్రత్యక్షప్రసారాలు లభిస్తాయి.
Share this article :

0 comments: