బీజేపీ, టీడీపీ కలిసి మోసం చేస్తున్నాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బీజేపీ, టీడీపీ కలిసి మోసం చేస్తున్నాయి

బీజేపీ, టీడీపీ కలిసి మోసం చేస్తున్నాయి

Written By news on Saturday, September 17, 2016 | 9/17/2016


'బీజేపీ, టీడీపీ కలిసి మోసం చేస్తున్నాయి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు కలిసి మోసం చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పార్థసారధి ఆరోపించారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ...బీజేపీ, టీడీపీ నేతలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సన్మానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రానికి నిధులు కేటాయిస్తారని ఆశించామని...కానీ ఏపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ప్రత్యేక హోదా చనిపోయిన అంశమని ప్రకటన చేసి...హోదాను చంపిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వెంకయ్యకు సన్మానం చేశారా.. ? అని పార్థసారధి ప్రశ్నించారు. జనాభా ప్రతిపాదికన రాష్ట్రాలకు ఎన్‌ఐటీ, ఐఐటీలు కేటాయిస్తారని...అంతే కానీ ఏపీకి ప్రత్యేకంగా కేటాయించింది ఏముందన్నారు. వెంకయ్య తానొక్కడే ఏపీకి ఏదో ఒరగబెడుతున్నట్లు కబుర్లు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. హోదా విషయంలో ఏపీకి చేసిన మోసాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించారన్నారు.

కాంగ్రెస్ పార్టీని, విభజన చట్టంలోని హామీలను విమర్శంచడమే తప్పా...గడిచిన రెండున్నర ఏళ్లలో చట్టంలో మార్పులు ఎందుకు చేయలేదన్నారు. హోదా అంశంపై విజయవాడలో వెంకయ్యనాయుడు దారుణంగా మాట్లాడారన్నారు. తెలుగు తల్లి రెండు కళ్లలో వెంకయ్య, బాబు రెండు వేళ్లతో పొడుస్తున్నారన్నారు. ఐదు కోట్ల ప్రజలు హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. నాడు పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు..పదేళ్లు ఇవ్వాలని వెంకయ్య నిలదీసిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్లు కేటాయించాలన్న దానిపై కేంద్రమంత్రికే స్పష్టత లేకపోవడం బాధకరమని పార్థసారధి అన్నారు.
Share this article :

0 comments: