స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు

స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు

Written By news on Sunday, September 25, 2016 | 9/25/2016


‘స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ప్రవాసాంధ్రులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానాలు ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నందుకు జననేతను ఎన్నారైలు అభినందించారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరి తూర్పారబట్టారు. భవిష్యత్ ఉద్యమ కార్యచరణ ఏవిధంగా ఉండబోతుందని వైఎస్ జగన్ ను అడిగారు. ప్రవాసులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సవివరంగా సమాధానాలిచ్చారు.

రమేష్(వాషింగ్టన్ డీసీ)
రమేష్: ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో చెప్పారు కానీ హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతగా మీరు ఎలాంటి పోరాటం చేస్తారు.?

జగన్: పోరాటం చేయకపోతే ఈ అంశం కోల్ట్ స్టోరేజ్ లోకి ఈ విషయం వెళ్తుంది. వివిధ స్థాయిల్లో ఇప్పటికే పోరాటం చేసాం. ప్రత్యేక హోదా ఎన్నిరోజుల్లో వస్తుందో చెప్పలేను. అసాధ్యం అనుకున్న తెలంగాణను వారు సాధించుకున్నారు. అలాంటప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటను మనం తెచ్చుకోలేమా. హోదా ఇచ్చే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తాం. హోదాపై చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు. ఇలా ఎందుకు చెబుతున్నానంటే అరుణ్ జైట్లీ సెప్టెంబర్ 7న ప్రకటన తర్వాత స్వాగతిస్తున్నానని చంద్రబాబు స్వయంగా స్వాగతించారు. హోదా తో ఏం వస్తుందని శాసనమండలిలో ప్రశ్నించారు. మండలిలో ఏకంగా హోదా వల్ల ఏం వస్తుందని ప్రశ్నించారు. ఇంగ్లీష్ వచ్చి ఉంటే జైట్లీ గారు చెప్పింది అర్థమై ఉండాలి.


వాసుదేవరెడ్డి(అమెరికా)
వాసుదేవరెడ్డి: ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్నారు కదా.. మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. అయితే తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసినట్లుగా మీరు ఏదైనా ప్రత్యేక పోరాటం చేయనున్నారా?

జగన్: అరుణ్ జైట్లీ స్టేట్ మెంట్ చూస్తే.. ఆయనకు ఎవరూ థ్యాంక్స్ చెప్పరు. కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా మన హక్కు ప్రకారం రావాల్సినది ఏదీ ఇవ్వకున్నా.. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన సాధారణ ప్యాకేజీలు ఇచ్చారు. మనకు ప్రత్యేకంగా వారు చెప్పినట్లు ఎక్కువ మొత్తంలో ఏమైనా ఇస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ అలాంటి పరిస్థితులు లేవు. మీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించకుండా కేంద్రంతో చంద్రబాబు రాజీపడుతున్నారు. మేం ఏదైనా దీక్ష చేపడితే.. మోదీ వస్తారు.. లేక మరెవరో వస్తారని సాకులు చెప్పి కుట్ర పన్ని దీక్ష భగ్నం చేస్తారు. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది. చంద్రబాబులో, కేంద్రంలో గానీ మార్పులు రాకపోతే.. మా పోరాటం ఉధృతం చేస్తాం. కొన్ని దశలుగా పోరాటం కొనసాగిస్తాం.. మా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తాం. దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం.

వెంకట్(శాన్ ఫ్రాన్సిస్కో)
వెంకట్: ఎన్నికల సమయంలో చెప్పిన వాగ్దానాలు, హోదా లాంటివి నెరవేర్చలేదు. అమెరికాలో ఉన్నట్లుగా నేతను రీకాల్ చేయవచ్చా?

జగన్: అమెరికాలో ఉన్నట్లుగా ఇక్కడ అవకాశం లేదు. అబద్దాలు చెప్పే నేతలున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల మ్యాండెట్ అనేది చాలా ముఖ్యం. విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు ఎలా బతికామన్నది ముఖ్యం.

రమేశ్ (వాషింగ్టన్ డీసీ)
రమేశ్: స్టేలు తెచ్చుకోడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు సాధించారు. ప్రత్యేక హోదా కోసం భవిష్యత్ లో ఎలా పోరాడతారు?

జగన్: ప్రత్యేక హోదా కోసం ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలు చేస్తున్నాం. భవిష్యత్ లో పోరాటం మరింత ఉధృతం చేస్తాం.
Share this article :

0 comments: