పెడన స్థానిక సంస్థలు వైఎస్ఆర్ సీపీ కైవసం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెడన స్థానిక సంస్థలు వైఎస్ఆర్ సీపీ కైవసం

పెడన స్థానిక సంస్థలు వైఎస్ఆర్ సీపీ కైవసం

Written By news on Thursday, September 29, 2016 | 9/29/2016


పెడన స్థానిక సంస్థలు వైఎస్ఆర్ సీపీ కైవసం
మచిలీపట్నం: ఒక్క ఓటు తేడాతో పెడన మున్సిపల్ చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసమైంది. టీడీపీకి చెందిన కౌన్సిలర్ స్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి బండారు ఆనంద్ ప్రసాద్ కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో చైర్మన్ పీఠం వైఎస్ఆర్ సీపీకి దక్కింది. పెడన మున్సిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో 11 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ సీపీ, మరో 11 మంది కౌన్సిలర్లు టీడీపీ తరపున ఎన్నికయ్యారు.
ఎక్స్ అఫిషియో సభ్యుడుగా స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకటరావు ఉన్నారు. దీంతో టీడీపీదే చైర్మన్ పీఠం అనుకుంటున్న తరుణంలో... కౌన్సిలర్ స్రవంతి ట్విస్ట్ ఇచ్చారు. టీడీపీ తరఫున గెలిచిన ఆమె ........ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి బండారు ఆనంద్ ప్రసాద్ కు ఓటు వేశారు. దీంతో చైర్మన్ కుర్చి వైఎస్ఆర్ సీపీ ఖాతాలోకి వెళ్లింది. పెడన మున్సిపల్ చైర్మన్ ఆకస్మిక మృతి చెందారు. దీంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

అలాగే పెడన మండల పరిషత్ పీఠం కూడా వైఎస్ఆర్ సీపీకే దక్కింది. ఇక్కడ వైఎస్ఆర్ సీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలలో ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉండగా, టీడీపీకి నలుగురే ఉన్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అచ్యుతరాజు నేరుగా ఎన్నికయ్యారు.
Share this article :

0 comments: