ఏపీని ఏం చేద్దామనుకుంటున్నావ్? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏపీని ఏం చేద్దామనుకుంటున్నావ్?

ఏపీని ఏం చేద్దామనుకుంటున్నావ్?

Written By news on Wednesday, September 14, 2016 | 9/14/2016


'ఏపీని ఏం చేద్దామనుకుంటున్నావ్?'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తన స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి థ్యాంక్స్ చెప్పారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలవరం కాంట్రాక్టు కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం పరిధిలో ఉన్న ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. టెండర్లు లేకుండా పోలవరం ప్రాజెక్టుకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, సీఎం స్థాయి వ్యక్తి సబ్ కాంట్రాక్టులు డిసైడ్ చేయడం దారుణం అన్నారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగలడం ఖాయం అని జోస్యం చెప్పారు. పోలవరం మెయిన్ ప్రాజెక్టును పక్కకు పెట్టి ఇప్పుడు కాపర్ డ్యాం నిర్మిస్తామంటున్నారని, అసలు మీ ఆలోచన ఏమిటని, రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.

మీ దోపిడీని అడ్డుకుంటే పోలవరానికి, రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షం అడ్డుతగులుతుందని రాద్ధాంతం చేస్తున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. తాబేదార్లకు, బూట్లు మోసేవారికి, సంచులు మోసేవారికోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కుంభంకోణం కేసులో దొంగలా దొరికిన చంద్రబాబు అందులో నుంచి బయటపడేందుకు హోదాను అమ్మేశాడని అన్నారు.
Share this article :

0 comments: