వైఎస్సార్‌సీపీ ప్రధానకార్యదర్శి భూమన ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌కు ఆశాజ్యోతి వంటి ప్రత్యేక హోదాను సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య తెలుగు జాతి ద్రోహులుగా మిగిలి పోతారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ హోదా కోసం ప్రజలంతా పోరాడుతూ ఉంటే ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ వల్లనే లాభాలెక్కువ అని వీరిద్దరూ తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వాస్తవానికి వెంకయ్య బీజేపీలో ఉండి కేంద్ర మంత్రిగా ఉన్నా టీడీపీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారన్నారు.
వెంకయ్య, చంద్రబాబు ఇద్దరూ అవిభక్త కవలలని, వారి శరీరాలు వేరైనా వారు ఆడే అబద్ధాలు ఒక్కటేనని ఎద్దేవా చేశారు. ప్రతిభావంతుడైన వెంకయ్య పదేళ్లు ప్రత్యేక హోదాను పట్టుబట్టి తెస్తారని ఎన్నికల్లో నరేంద్రమోదీ చెప్పలేదా! అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తుందని చంద్రబాబు ఆనాడు చెప్పలేదా? ఇపుడెందుకు ప్రయోజనం లేదంటున్నారని మండిపడ్డారు

0 comments:
Post a Comment