గుంటూరు : అధర్మమే పాలనగా సాగుతున్న టీడీపీ పునాదులు పెకళించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాయంలో మంగళవారం మాజీ కార్పొరేటర్‌లు తుమ్మేటి శారదా శ్రీనివాస్, ఉడతా కృష్ణ, బత్తుల దేవానంద్‌లు వైఎస్సార్ సీపీలో చేరారు. వారితోపాటుగా 33, 38, 43 డివిజన్‌లకు చెందిన మద్దతుదార్లు పార్టీలోకి వచ్చారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ పీడీ యాక్టులు పెట్టడం సిగ్గు చేటన్నారు. టీడీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శులు, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), లక్కాకుల థామస్‌నాయుడు మాట్లాడుతూ ప్రభు త్వ విధానాలను కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో నోరు మూయించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్లు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ సంయుక్త కార్యదర్శి షేక్ గులాంరసూల్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూనె ఉమామహేశ్వరరెడ్డి, పలు విభాగాల నేతలు మద్దుల రాజాయాదవ్, మార్కెట్‌బాబు, అగ్గిపెట్టెల రాజు, నూనె పవన్‌తేజ, షఫీ, ఎన్ రామారావు, రమేష్, రెడ్డి కోటేశ్వరరావు, నరాలశెట్టి అర్జున్, పఠాన్‌ఖాన్, మోహన్‌రావు, పెద్దబ్బాయి, రవి పాల్గొన్నారు.
0 comments:
Post a Comment