బాబులిద్దరూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబులిద్దరూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు

బాబులిద్దరూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు

Written By news on Saturday, October 8, 2016 | 10/08/2016


బాబులిద్దరూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు
అవినీతి పరమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్:రాష్ట్రాన్ని దోచుకోవడమే పరమధ్యేయంగా చినబాబు,పెదబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇంకా ఎంతమంది రైతులు నష్టపోతే సీఎం చంద్రబాబు ధనదాహం తీరుతుందోనన్నారు. అవినీతే పరమధ్యేయంగా కార్యక్రమాలు చేసుకుంటూపోతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విదేశీ కంపెనీలకోసం రాష్ట్రప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం సరికాదన్నారు. అధికారముందని ఇష్టానుసారంగా చట్టాలు చేస్తే చాలదని, రాజ్యాంగానికి లోబడి ఉండాలన్నది మరచిపోరాదన్నారు. చట్టాలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు వద్దన్నా వినకుండా స్విస్‌చాలెంజ్‌పై గుడ్డిగా ముందుకెళ్లడం రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదన్నారు.

 అవినీతి రాజ్యమేలుతోంది..
 టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఒక్క సంక్షేమ పథకమూ అమలు కావట్లేదని బొత్స విమర్శించారు. ఎక్కడచూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. నీతిమంతుడ్ని, అనుభవజ్ఞుడ్ని, అభివృద్ధి అంటే చంద్రబాబు అని సొంతడబ్బా కొట్టుకునే చంద్రబాబు.. చేతల్లో మాత్రం స్వార్థం, అవినీతి, ఆశ్రీతపక్షపాతమని దుయ్యబట్టారు. సాక్షాత్తూ ప్రభుత్వవిప్ ఇసుక దందాకు పాల్పడుతుంటే.. ఆటకాయించిన అధికారుల్ని చంద్రబాబు తప్పుపట్టారన్నారు. రుణమాఫీ చేయకుండా ప్రచారం చేసుకుంటున్న సీఎంను చంద్రబాబునే చూస్తున్నానన్నారు. నాన్న అడుగుజాడల్లో నడుస్తా.. ఆయనకు తలవంపులు తేను అంటే.. నీ తండ్రి ఏమన్నా స్వాతంత్యం తెచ్చిన వ్యక్తా? లేక ఇచ్చినమాట నిలబెట్టుకున్న వ్యక్తా? అని లోకేశ్‌ని బొత్స ప్రశ్నించారు. నీ తండ్రే అవినీతి.. కోర్టులో స్టేలు తెచ్చుకుంటున్న మహాపురుషుడని ఎద్దేవాచేశారు.

 పోలవరాన్ని ఏం చేయబోతున్నారు?
 కాంట్రాక్టులకోసం కక్కుర్తిపడి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని తామే పూర్తి చేస్తామని తెచ్చుకున్న సీఎం ఇప్పుడా ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు ఏం సమాధానం చెబుతారో చూడాలని బొత్స అన్నారు. కేంద్రం పరిధిలో ఉండుంటే కేంద్రమే అన్నీతానై చూసుకునేదన్నారు. పర్యావరణ అనుమతులు, పునరావాసం, భూసేకరణ, రైతులకు నష్టపరిహారం తదితర అంశాలపై సుప్రీంకోర్టు నుంచి అందిన నోటీసులకు ఏం జవాబు చెబుతారని నిలదీశారు.
 
 పాపం.. చినరాజప్ప..
 టీడీపీ శిక్షణ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పపట్ల లోకేశ్ వ్యవహరించిన తీరును బొత్స ఆక్షేపించారు. పదవికి కాకున్నా వయసుకైనా గౌరవమివ్వకుండా లోకేశ్ మాట్లాడిన తీరును తప్పుపట్టారు. సోషల్‌మీడియాలో ప్రచారమవుతున్న ఫొటోను చూస్తుంటేనే ఆయనెంతగా వణికిపోతున్నారో కనిపిస్తోందన్నారు. చినరాజప్పను ప్రశ్నించడానికి లోకేశ్ ఏమైనా పార్టీ అధ్యక్షుడా? అని ప్రశ్నించారు. వయస్సులో పెద్దవాడైన ఉపముఖ్యమంత్రినే గౌరవించే సంప్రదాయంలేని పార్టీ తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుతుందన్నారు.
Share this article :

0 comments: