ప్రధానమంత్రికి వైఎస్ జగన్ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రధానమంత్రికి వైఎస్ జగన్ లేఖ

ప్రధానమంత్రికి వైఎస్ జగన్ లేఖ

Written By news on Thursday, October 13, 2016 | 10/13/2016


ప్రధానమంత్రికి వైఎస్ జగన్ లేఖ
► ఆదాయ వెల్లడి పథకంలో పేర్లను బయటపెట్టండి
► చంద్రబాబుకు ఆ వివరాలు ఎలా తెలిశాయి
► కచ్చితంగా లెక్క చెబుతున్నారంటే ఆ వ్యక్తి ఆయన బినామీ అయి ఉండాలి
► వివరాలు బయటకు చెప్పబోమని సీబీడీటీ స్పష్టం చేసింది
► ఆ తర్వాత కూడా చంద్రబాబు మాత్రం వివరాలు చెబుతున్నారు
► ఆదాయన్ని ప్రకటించినవారి పేర్లు బయటపెట్టండి
► లేఖలో ప్రధానమంత్రిని కోరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

హైదరాబాద్

ఆదాయ వెల్లడి పథకం -2016పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రధానికి జగన్ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి....

''ఏపీలో ఐడీఎస్-2016పై జరిగిన పరిణామాలను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ అంశంపై తలొకరు తలోరకంగా మాట్లాడుతున్నారు. ఆదాయాన్ని వెల్లడిస్తే వారి వివరాలు వెల్లడించబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చెబుతోంది. ప్రాంతాలవారీగా గానీ, మరే రూపంలో గానీ వారి పేర్లను బయట పెట్టబోమని స్పష్టం చేస్తోంది. మరోవైపు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఆ వివరాలు బయటకు చెబుతున్నారు. సీబీడీటీ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆయన రెండు సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి 10 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెల్లడించారని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబుకు ఈ సమాచారం ఎలా లభ్యమైంది? ఒకవేళ అది వాస్తవం అయితే.. ఆయన చంద్రబాబు బినామీ అయి ఉండాలి. ఎందుకంటే, చంద్రబాబు అంత కచ్చితంగా ఆ మొత్తం ఎంతో చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మేం కూడా దీని గురించి తెలుసుకుంటున్నాం.

ఎన్‌సీఏఈఆర్ సర్వేలో చంద్రబాబు పాలనలోని ఆంధ్రప్రదేశ్ అత్యంత అవినీతిపరమైన రాష్ట్రంగా మొదటి ర్యాంకు సాధించింది. రెండున్నరేళ్ల కాలంలో రూ. లక్షన్నర కోట్ల కుంభకోణానికి ఎలా పాల్పడ్డారో ఇటీవలే ఓ పుస్తకం ప్రచురించి, దాన్ని కూడా మీకు ఇచ్చాం. విచారణ చేయడానికి తగినంత సమాచారం ఆ పుస్తకంలో ఉంది. మేం ఇచ్చిన విజ్ఞాపనపై ఇంతవరకు ఎలాంటి విచారణ జరగలేదు, ఎలాంటి చర్య తీసుకోలేదు. దేశంలో ఏ ఒక్కరూ కూడా తనపై విచారణ జరిపించలేరని చంద్రబాబు గట్టి నమ్మకంతో ఉన్నారు. నల్లధనంతో ఎమ్మెల్యేలను కొన్నా.. ఓటు కోసం కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయినా.. వేల కోట్లు పోగేసినా నిరభ్యంతరంగా పదవిలో కొనసాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. దయచేసి ఐడీఎస్‌లో ఆదాయాన్ని ప్రకటించిన వారి పేర్లు వెల్లడించాలని కోరుతున్నాం. అలాగే చంద్రబాబు అవినీతిపై విచారణ చేయించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం''
Share this article :

0 comments: