ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కడప చెన్నూరు బస్టాండ్ లో గురువారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్ లో ఆయన పాల్గొన్నారు. బ్యాలెట్ లో ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ స్పష్టీకరించారు.
నింపిన బ్యాలెట్ పత్రాన్ని బ్యాలెట్ బాక్సులో వేశారు. ప్రత్యేక హోదాతో పాటు కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అమరావతిని ఫ్రీ జోన్ గా చేయాలన్న సీపీఐ డిమాండ్ లను కూడా ఆయన పరిశీలించారు. ప్రత్యేక హోదా విషయంలో ఎవరు ఆందోళనలు చేసినా తన మద్దతు ఉంటుందని సీపీఐ నేతలకు ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న వైఎస్ జగన్ ఈ ఉదయం పులివెందుల అమ్మవారిశాలకు చేరుకుని దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. పెండ్లిమర్రిలో వేరుశనగ రైతులతో ఆయన మాట్లాడారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

0 comments:
Post a Comment