చంద్రబాబువన్నీ బడాయి మాటలే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబువన్నీ బడాయి మాటలే

చంద్రబాబువన్నీ బడాయి మాటలే

Written By news on Tuesday, November 1, 2016 | 11/01/2016


చంద్రబాబువన్నీ బడాయి మాటలే: విశ్వేశ్వరరెడ్డి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని  సామాజిక అధ్యయనాల సంస్థ (సెస్‌) బయటపెట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైవీ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ రైతాంగం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు సెస్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. సెస్ నివేదికతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలన్నీ బడాయి మాటలేనని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీ రైతులు అప్పుల్లో మునిగిపోయారని నివేదికలో తేలిందని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రెండంకెల వృద్ధిరేటు అని, వ్యవసాయ మిషన్ అని గొప్పలు చెబుతున్నరని, అయితే అవన్నీ పచ్చి అబద్ధాలని సెస్ నివేదికతో తేలిపోయిందన్నారు.  ఇందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదకే నిదర్శనమన్నారు. రుణమాఫీ చేసి ఉంటే....రాష్ట్రంలో 93 శాతం రైతులు  అప్పుల్లో ఎందుకు కూరుకుపోయి ఉంటారని  ప్రశ్నించారు.

చంద్రబాబు పాలనలో అన్నదాతలు అన్ని విధాలా అన్యాయమైపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి జపమే తప్ప చంద్రబాబు వ్యవసాయాన్ని ఏనాడు పట్టించుకోలేదని విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడొద్దని, సెస్ నివేదికతో అయినా ప్రభుత్వం కళ్లు తెరిచి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్షోభం నుంచి వ్యవసాయరంగం బయటపడే మార్గాలు వెతకాలని విశ్వేశ్వరరెడ్డి సూచించారు.
Share this article :

0 comments: