బాబును చూస్తే మధురవాణి పాత్ర గుర్తొస్తోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబును చూస్తే మధురవాణి పాత్ర గుర్తొస్తోంది

బాబును చూస్తే మధురవాణి పాత్ర గుర్తొస్తోంది

Written By news on Thursday, November 10, 2016 | 11/10/2016


‘బాబును చూస్తే మధురవాణి పాత్ర గుర్తొస్తోంది’
హైదరాబాద్ : ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తుంటే కన్యాశుల్యంలో మధురవాణి పాత్ర గుర్తుకు వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధికి  వైఎస్ఆర్ సీపీ ఆటంకాలు సృష్టిస్తోందని చంద్రబాబు, లోకేశ్, మంత్రులు ఒకటే భజన చేస్తున్నారన్నారు. తాము ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు అడ్డుపడతామే తప్ప... అభివృద్ధికి కాదన్నారు.
 
అభివృద్ధికి వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారని టీడీపీ నేతలు నోరు పారేసుకోవడం తగదని అంబటి సూచించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉందని, అభివృద్ధిని అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేవని ఆయన అన్నారు.  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేశ్ కు  లేదని అంబటి అన్నారు. పిచ్చి మాటలు వద్దని... కాకిపిల్ల కాకే అవుతుంది కానీ...కోకిల ఎప్పటికీ కాలేదని ఆయన ధ్వజమెత్తారు. 
 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బందరు పోర్టు కోసం 1200 ఎకరాలు చాలన్న చంద్రబాబు ఇప్పుడు 33వేల ఎకరాల భూమిని తీసుకోవడం వెనుక ఉద్దేశమేంటో చెప్పాలని అంబటి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు పోలీసు బందోబస్తు లేకుండా ప్రజల వద్దకు వెళితే ప్రజలు తరిమి తరిమి కొడతారని ఆయన అన్నారు.
 
రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి ఏ రాజకీయ పార్టీకి ఉందో అందరికి తెలుసని, అధికారం కోసం తాపత్రాయపడేది నారా వంశస్తులేనని అంబటి వ్యాఖ్యలు చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్ర జరిగి తీరుతుందన్నారు. దానికి ఆటంకాలు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అంబటి హెచ్చరించారు. 
Share this article :

0 comments: