హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముందే తెలుసని వైఎస్‌ఆర్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అందుకే తన వ్యవహారాలన్నింటని ముందే చక్కబెట్టుకున్నారని చెప్పారు. కానీ, పైకి మాత్రం తానే నోట్ల రద్దు సూచన చేస్తూ లేఖ రాసినట్లుగా ప్రజలను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు డబ్బులు ఎందుకని, కార్డులే ఉపయోగించాలని చంద్రబాబు అంటున్నారని, నిరక్షరాస్యత, పేదరికం, అవగాహన లేమి తక్కువగా ఉన్న రాష్ట్రంలో పేద ప్రజలు ఎలా కార్డులు ఉపయోగిస్తారని ఆయన నిలదీశారు. నోట్ల రద్దుకు పది రోజుల ముందే చంద్రబాబు తన షేర్లను అమ్ముకున్నారని, సామాన్యుల ఇబ్బందులు మాత్రం ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు హెరిటేజ్ షేర్ విలువ రూ.199 ఉంటే ఆయన అధికారానికి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.999కి పెరిగిందని, అంటే సుమారు నాలుగున్నరరెట్లు పెరిగిందని తెలియజేశారు. రాష్ట్రాభివృద్ధి మాత్రం ఆ స్థాయిలో లేదని బుగ్గన మండిపడ్డారు.

0 comments:
Post a Comment