కేంద్రం లీకిచ్చింది.. బాబుకు ముందే తెలుసు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రం లీకిచ్చింది.. బాబుకు ముందే తెలుసు: వైఎస్ జగన్

కేంద్రం లీకిచ్చింది.. బాబుకు ముందే తెలుసు: వైఎస్ జగన్

Written By news on Wednesday, November 23, 2016 | 11/23/2016


కేంద్రం లీకిచ్చింది.. బాబుకు ముందే తెలుసు: వైఎస్ జగన్
రాజమహేంద్రవరం: 'పెద్ద నోట్ల రద్దువంటి పెద్ద అంశాలపై అధికార ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ప్రతిపక్షాలను సంప్రదించడం, సామాన్యులను సంప్రదించడం చేస్తుంది. ఆ నిర్ణయం తర్వాత ఏర్పడే ప్రభావం నుంచి బయటపడే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం అలా చేయలేదు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై ప్రజల పక్షాన ప్రతిపక్షం గొంతు విప్పుతుందని ఆయన స్పష్టం చేశారు.

పెద్ద నోట్లను రద్దు చేయగానే తన సూచన మేరకే కేంద్రం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు అన్నారని, అంతవేగంగా ఆయనెలా స్పందించగలిగారని ప్రశ్నించారు. కేంద్రం సెలక్టివ్ పీపుల్స్ కు ముందే లీకులిచ్చిందని, అందులో చంద్రబాబు కూడా ఉన్నారని, అందులో భాగంగానే అక్టోబర్ 12న చంద్రబాబు రూ.500, రూ.1000నోట్లను రద్దు చేయాలని లేఖ రాశారని వైఎస్ జగన్ చెప్పారు. కేంద్రం నిర్ణయానికి సరిగ్గా నెల రోజుల ముందు చంద్రబాబు తన పరిస్థితులు చక్కబెట్టుకొని సామాన్యులను మాత్రం గాలికొదిలేశారని అన్నారు. చంద్రబాబు చర్యలు చూశాక కూడా ఎవరికీ తెలియకుండానే తాము నిర్ణయం వెలువరించామని కేంద్రం చెప్పే మాటలు తాము ఎలా నమ్మాలని ప్రశ్నించారు.

నల్లడబ్బును అరికట్టేందుకే అని కేంద్రం చెప్పినా ఊహించని విధంగా నిర్ణయం వెలువరించారన్నారు. నల్లడబ్బును అరికట్టడాన్ని తాము స్వాగతిస్తామని, సరైన విధంగా అమలు చేయకపోవడం మూలంగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రణాళికలు కూడా సరైన విధంగా అమలు చేయకుంటే విఫలమవుతాయని అన్నారు. యూఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ గా ఉన్న గోర్బచావ్ సోషల్ ఎకనామిక్ నుంచి లిబరల్ ఎకానమిగా మార్చే పెద్ద నిర్ణయం తీసుకున్నారని, కానీ, దాని అమలుకోసం సరైన చర్యలు తీసుకోకపోవడంతో విఫలమైందని గుర్తు చేశారు. నోట్ల రద్దు అమలులో పారదర్శకత లోపించిందన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...
  • పాత పెద్ద నోట్ల రద్దుతో చిన్న, సన్నకారు రైతులు కష్టాలు పడుతున్నారు
  • ఇవాళ రైతులు తమ పంటను అమ్ముకోలేని, కొత్త పంటలు వేసుకోలేని పరిస్థితి ఉంది
  • వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలో సగం కూడా రాని పరిస్థితి నెలకొంది
  • వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు, ఇదంతా నల్లధనం ఎలా అవుంది?
  • మనదేశంలో ఉన్న 6 లక్షల 38 వేళ్ల  గ్రామాలు క్యాష్ ఎకానమీతో నడుస్తున్నాయి
  • గ్రామాల్లో 75 శాతం మంది క్యాష్ ఎకానమీతో బతికే పరిస్థితి ఉంది
  • 92 శాతం గ్రామాలకు బ్యాంకులు లేవు
  • 53 శాతం జనాభాకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి
  • దేశంలో ఉన్న ఏటీఏంలలో పదిశాతం కూడా గ్రామాల్లో లేవు
  • 2 వేల నోటు తీసుకెళితే ఎవరూ చిల్లర ఇవ్వడం లేదు
  • 2 వేల రూపాయల నోటు ఎందుకు తెచ్చారో ఎవరికీ తెలియడం లేదు
  • పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో పెళ్లిళ్లు కూడా వాయిదా పడుతున్నాయి

ఉద్దేశాలు మంచివే.. అమలులో విఫలం
  • దేశంలో 50 లక్షల మందికి 2 కోట్ల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. ఇవన్ని 120 కోట్ల మంది జనాభాకు ఏవిధంగా సరిపోతాయి?
  • పాత పెద్ద నోట్లు నిర్ణయం మంచిదే కానీ దీన్ని అమలు చేయడంలో విఫలమయ్యారు
  • ముందస్తు సన్నాహాలు చేయకుండా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సమజసం కాదు
  • ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి, దీనికి కొంత సమయం పడుతుంది
  • 1975లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు చెలామణిలో వాటి భాగం 0.6 శాతం మాత్రమే
  • ఇప్పుడు 86 శాతం చెలామణిలో ఉన్న కరెన్సీని రద్దు చేసినప్పుడు ఎంత ప్రిపరేషన్‌ ఉండాలి?
  • ముందు ప్రణాళిక లేకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు సమర్థించడం దారుణం
  • మొదట ఒక మాట, తర్వాత ప్లేటు ఫిరాయించి మరొక మాట మాట్లాడారు
  • నోట్ల కష్టాలు తీరేవరకు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి
  • రద్దు నిర్ణయాన్ని వాయిదా వేయడం వల్ల ఎటువంటి నష్టం జరగదు, వారు అనుకున్న ఉద్దేశాలు నెరవేతాయి
  • బాగుంటే నా నిర్ణయం.. బాగా లేకుంటే మోదీ నిర్ణయం అన్నట్టుగా చంద్రబాబు స్పందన ఉంది
తెలుసు కాబట్టే హెరిటేజ్ షేర్లు అమ్ముకున్నారు
  • పెద్ద నోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసు
  • అందుకే మూడు రోజుల ముందే హెరిటేజ్‌ షేర్లు అమ్ముకున్నారు
  • చంద్రబాబు సీఎం అయ్యేనాటికి హెరిటేజ్ షేర్ విలువ రూ.199
  • ఈ రెండున్నరేళ్లలో హెరిటేజ్ షేర్ విలువ రూ.909కి పెరిగింది.
  • అంటే సుమారు 450శాతం విలువ పెరిగింది

వాయిస్ ఆఫ్ పీపుల్
  • పెద్ద నిర్ణయాలను తీసుకునే ముందు కాస్తంత ఆలోచన చేయండి
  • నల్ల డబ్బు అంతం చేయడాన్ని మేం కూడా స్వాగతిస్తాం
  • ఏటీఎంల వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇప్పించాలి
  • ప్రతిపక్షం అంటే వాయిస్ ఆఫ్ పీపుల్
  • ప్రజలు ఒక నిర్ణయం బాగుందంటే మేం బాగుందంటాం.. వారు బాగలేదంటే బాగ లేదని చెప్తాం
  • ప్రతిపక్షాలు అడ్డగోలుగా స్పందించకూడదు. ప్రజల స్పందన చూశాకే స్పందించాలి
  • అనూహ్య నిర్ణయాలపై ఎలా స్పందించాలి
  • ప్రతి ఒక్కరి నుంచి అభిప్రాయాలు, వారి బాధలు తెలుసుకున్న తర్వాతే మేం మాట్లాడుతున్నాం
  • మేం చెప్పే ప్రతి మాట ఇప్పుడు చాలా నిర్మాణాత్మకమైనది
  • అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత నిర్ణయం వెలువరించాలి
  • ప్రతి నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడే చెప్పనక్కర్లేదు.. పార్టీలో అధికార ప్రతినిధులు చెప్పేవి కూడా పార్టీవే
  • చంద్రబాబునాయుడు మాదిరిగా పని పాట లేకుండా మేం లేము
  • ప్రజలకే బాబు ముఖం చూసి చూసి చిరాకొచ్చేస్తుంది
  • పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ప్రతి అంశంపై అవగాహన ఉండాలి
Share this article :

0 comments: