లాభపడ్డామా? నష్టపోయామా? అన్నది ఆలోచించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లాభపడ్డామా? నష్టపోయామా? అన్నది ఆలోచించాలి

లాభపడ్డామా? నష్టపోయామా? అన్నది ఆలోచించాలి

Written By news on Sunday, November 6, 2016 | 11/06/2016


బాబు పాలన ఏడ్చినట్టు ఉంది: వైఎస్‌ జగన్‌
విశాఖపట్నం:చంద్రబాబునాయుడు గత రెండున్నరేళ్ల పరిపాలనలో ఎక్కడా ప్రజలు సంతోషంగా లేరని, ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు పరిపాలన ఏడ్చినట్టు ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్‌’  బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తూ.. ఒకప్పుడు ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అన్న ఉద్యమానికి విశాఖ గడ్డ స్ఫూర్తినిచ్చిందని, ఈరోజు ఇదే గడ్డ మీద ప్రత్యేక హోదా ఉద్యమబాట పట్టాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 
  • 2014 ఎన్నికల సమయంలో ఇదే వేదికపై నిలబడి చంద్రబాబు నాయుడు, నరేంద్రమోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. 
  • ఇదే వేదిక మీద ఐదేళ్లు కాదు, పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఇచ్చారు.
  • ఈ రోజు అబద్ధాలు చెప్పి, మోసం చేసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తివిధంగా ‘జై ఆంధ్రప్రదేశ్‌’ అంటూ నినదించాలి. ( చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవిధంగా నినదించాలని వైఎస్‌ జగన్‌ కోరడంతో సభాప్రాంగణం ఒక్కసారిగా ‘జై ఆంధ్రప్రదేశ్‌’ నినాదాలతో మార్మోగింది).
  • విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమానికి నేటితో 50 ఏళ్లు నిండింది.
  • ఈ ఉద్యమానికి ఊపిరి పోయడమే కాదు.. స్టీల్‌ ఫ్యాక్టరీని సాధించుకున్న గడ్డ విశాఖపట్నం.
  • మన ప్రభుత్వమే మన కంట్లో వేలు పొడిచేలా చేస్తుండటంతో విశాఖ వేదికగా జై ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమాన్ని చేపడుతున్నాం.
కొన్ని ప్రశ్నలతో వచ్చా: వైఎస్‌ జగన్‌
  • ప్రసంగాలతో ఊదరగొట్టడానికి ఈ సభకు రాలేదు.. నా ఆవేదన పంచుకోవడానికి వచ్చా. ఇక్కడికి కొన్ని ప్రశ్నలతో వచ్చా. కొన్ని ఆలోచనలతో వచ్చా. మిమ్మల్ని కూడా ఆలోచింపజేయడానికి వచ్చా.
  • రాష్ట్ర విభజన వల్ల మనం లాభపడ్డామా? నష్టపోయామా? అన్నది ఆలోచించాలి.
  • మనకు లాభం జరుగుతుందని చెప్పి విభజన చేశారు.
  • ఈ రెండున్నర సంవత్సరాల్లో విభజన వల్ల మన రాష్ట్రానికి ఏమైనా లాభం జరిగిందా? లేక నష్టపోయామా?  అన్నది ఆలోచన చేయాలి.
  • ఈ రెండున్నరేళ్లలో ఈ ప్రభుత్వం మన హక్కుల కోసం పోరాటం చేసిందా? మనకు తోడుగా నిలబడిందా? విభజనతో మనకు మంచి జరిగిందా? అన్నది ఆలోచన చేయాలి.
  • రాష్ట్రంలో రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఏ కుటుంబమైనా కోరుకునేది తమ పిల్లల్ని చదువించుకోవాలని, వారికి మంచి కొలువులు రావాలని, ఉండటానికి సరైన ఇల్లు ఉండాలని, జబ్బులు వస్తే ఆస్తులు అమ్మకుండా వైద్యం అందాలని, వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రభుత్వ అండదండలు అందాలని, ఆదాయం తగ్గకూడదని కోరుకుంటారు. విభజన అనంతరం ఈ కనీస విషయాల్లో భరోసా ఇచ్చేవిధంగా ఈ ప్రభుత్వం రెండున్నరేళ్లలో పరిపాలన అందించిందా? అంటే లేదని ప్రజల నుంచి వినిపిస్తోంది.
  • గడిచిన ఈ కాలంలో మనం ఎలా ఉన్నాం? మన గ్రామాలు సంతోషంగా ఉన్నాయా? మన రైతులు, కార్మికులు సంతోషంగా ఉన్నారా? లేరు. మన డ్వాక్రా మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? మన యువత, నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? లేరు.
  • మన రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్ల సంవత్సరాల్లో భారీ పరిశ్రమలు ఎన్ని వచ్చాయి?
  • మన రైతులు తమ భూమిని ప్రభుత్వం లాక్కోకుండా ఉంటుందని భరోసాగా ఉన్నారా? అంటే అదీ లేదు. 
  • అందరికీ పక్కా ఇళ్లు ఇచ్చే పరిస్థితి ఉందా? అప్పులు కాకుండా మన పిల్లలు చదువులు పూర్తిచేసుకునే పరిస్థితి ఉందా? లేదు.
  • ఎక్కడా ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు.
  • ఈ ప్రభుత్వం కనీసం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలైనా నెరవేర్చిందా?
  • బేషరతుగా పూర్తిగా రైతులకు రుణమాఫీ చేశారా? బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ అమలైందా? అంటే అదీ లేదు.
  • జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. జాబు ఆలస్యమైతే ప్రతి ఇంటికీ రెండువేల భృతి ఇస్తానన్నారు? ఈ 30 నెలల బాబు పాలనలో మీ ఇంటికి రూ. 60వేల నిరుద్యోగ భృతి వచ్చిందా? అంటే రాలేదన్న సమాధానమే ప్రజల నుంచి వినిపిస్తోంది.
  • బెల్టు షాపులు తీసేస్తామన్నారు. కనీసం గ్రామాల్లో బెల్టు షాపులు తగ్గాయా? లేదు
  • ఎన్నికలప్పుడు ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా వచ్చిందా? రాలేదు
  • ఇవాళ ప్రజలెవరూ సంతోషంగా లేరు. చంద్రబాబు పాలన ఏడ్చినట్టు ఉంది.
  • వైఎస్సార్ ప్రభుత్వం ఇళ్లు కట్టడంలో రికార్డుగా నిలిచింది
  • ఇవాళ పేదలు ఇళ్ల కోసం నిరీక్షిస్తూ వెతికినా ఒక్క ఇల్లు కనబడని పరిస్థితి
  • వైఎస్సార్ పాలనలో అర్హులైన ప్రతిఒక్కరికి పెన్షన్ ఇచ్చారు
  • మనం రాష్ట్రంలో గ్యాస్ ఇచ్చిన తర్వాతే తీసుకెళ్లాలని వైఎస్సార్ పోరాడారు

రెండో విప్లవం రావాలి
  • కేంద్రం బెదిరించక ముందు మన సీఎం చేతులెత్తేసి వారి కాళ్ల మీద పడే పరిస్థితి ఇవాళ ఉంది
  • ప్రతి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుపడాలన్న, సామాజికంగా ఎదగాలన్నా ఉద్యోగాల విప్లవం, రెండో విప్లవం రావాలి
  • చదువుల విప్లవం వస్తే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుంది
  • ముందుండి పోరాటం చేయాల్సిన సీఎం చదువుల విప్లవంను నీరు గార్చారు
  • చంద్రబాబు పాలనలో అవినీతి విప్లవం వచ్చింది
  • కేసుల నుంచి బటయపడేందుకు 5 కోట్ల ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చేయని కుట్ర లేదు
  • ఒక సీఎం అవినీతి సొమ్మును సూట్ కేసులో పెట్టుకుని నల్లధనంతో ఎమ్మెల్యేలను కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా అరెస్ట్ కాలేదు
  • చంద్రబాబు కాబట్టే మన ఖర్మ కొద్ది ఇదంతా చూడాల్సి వస్తోంది
  • ప్రజలకు మేలు చేయడం కోసం సీఎం వెనుకడుగు వేయకుండా పరితపించాలి
  • అవకాశం ఉంటే ఇక్కడ ఎందుకు పుడతాం, నేను, వెంకయ్య అమెరికా పుట్టేవాళ్లం అంటాడు
  • ఇటువంటి వ్యక్తి పరిపాలన చేయడానికి యోగ్యుడా అని ప్రశ్నిస్తున్నా
  • ప్రజలను మభ్యపెట్టేందుకు ప్యాకేజీ బ్రహ్మండంగా ఉందని అంటున్నాడు
  • హోదా కోసం పోరాటం చేయాల్సిన సీఎం వెన్నుపోటు పొడుస్తున్నాడు
  • మన రాష్ట్రం కోసం పరితపించాల్సిన వ్యక్తి సొంత లాభం కోసం వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు రాష్ట్రం నివ్వెరపోతోంది
  • వెంకయ్య, చంద్రబాబు కలిసి చీకటి ఒప్పందాల కోసం ప్రజల భవిష్యత్ తాకట్టు పెడుతున్నారు
  • తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో ఆనాడు టీడీపీ పార్టీ ఆవిర్భవించింది
  • ఎన్టీఆర్ ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి టీడీపీని చంద్రబాబు దిగజార్చారు
  • తెలుగువాడి ఆత్మగౌరవంతో చెలగాటం ఆడుకుంటున్నందుకు సిగ్గుతో తలవంచుకోవాలి
  • ప్రత్యేక హోదా అంటే ఆకాశం నుంచి ఊడిపడేది కాదు
  • ప్రత్యేక హోదా అంటే మన పిల్లలకు మన ప్రాంతం, మన జిల్లా, మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి
  • ఉద్యోగాల కోసం మన పిల్లలు ఇతర రాష్టాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతాలకు, మన జిల్లాలకు, మన దగ్గరకు రావడమే ప్రత్యక హోదా అంటే
  • హోదా తేవాలని సీఎంకు, ఇవ్వాలని కేంద్రానికి లేదు. ఇలాంటప్పుడు మనం చేతులు కట్టుకుని కూచోవాలా
  • చేతుల కట్టుకునే జాతేనా మనది. చేతులు కట్టుకునివుంటే స్వాతంత్ర్యం వచ్చేదా, మద్రాసులో రెండో శ్రేణి పౌరులుగానే ఉండేపోయేవాళ్లం
  • ఉద్యమాలు అంటే వెరపు లేదు, జైళ్లు అంటే భయం లేదు
  • అన్ని ప్రాంతాల్లో సభలు, యువభేరీలు పెడతాం.. ధర్నాలు చేస్తాం, పోరాటం కొనసాగిస్తాం..
  • పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత శీతాకాల సమావేశాలకు వరకు వేచి చూస్తాం
  • అప్పటికీ హోదా ఇవ్వకుంటే మా ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి, మనక జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా చేస్తాం
  • ప్రత్యేక హోదా అంశాన్ని 2019 ఎన్నికల్లో రెఫెండంగా మార్చే ప్రయత్నం చేస్తాం
  • ప్రత్యేక హోదా డిమాండ్ ఎవరైనా చేస్తే పీడీ యాక్టు పెడతానని చంద్రబాబు బెదిరిస్తాడు
  • హోదా కోసం బంద్ లు చేస్తే దగ్గరుండీ ఆర్టీసీ బస్సులను ఆయనే తిప్పిస్తాడు
  • ఇటువంటి వ్యక్తి మీద టాడా కేసు పెట్టినా తప్పులేదు
  • ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రం నంబర్ వన్ అవుతుంది, ప్రత్యేక హోదా వల్లే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది
  • అరుణ్ జైట్లీ, వెంకయ్య, చంద్రబాబు కలిసి హోదా రాకుండా కుట్ర చేస్తున్నారు

Share this article :

0 comments: