నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం

నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం

Written By news on Wednesday, November 2, 2016 | 11/02/2016

 ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌. జగన్ మోహన్ రెడ్డి బుధవారం చంద్రగిరిలో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గాన చంద్రగిరి చేరుకున్నారు. స్థానిక వైఎస్‌ఎంఆర్‌ కల్యాణ మండపంలో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులు శుభకర్‌రెడ్డి, నళినీరెడ్డిలను ఆశీర్వదించారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని.. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. 
 
కాగా చాలా రోజుల తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి విచ్చేస్తున్న అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రేణిగుంటలో అభిమానులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి మీదున్న దామినేడు నుంచి చంద్రగిరి వరకూ రోడ్డుకు ఒకవైపున పార్టీ జెండాలు పట్టుకుని 7 వేల మంది అభిమానులు ఆయన కోసం వేచి ఉన్నారు. హైవే మీద 20 కిలోమీటర్ల పొడవున భారీ జెండాలను ఏర్పాటు చేశారు. 

 
Share this article :

0 comments: