
కాకినాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 7,8 తేదీల్లో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తెలిపారు. 7 వ తేదీ రంపచోడవరం, మారేడుమిల్లిలో పర్యటన కొనసాగనుంది. 8 వ తేదీ విలీన మండలాల్లో పర్యటించి పోలవరం నిర్వాసితులతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. అనంతరం కాళ్లవాపు బాధితులను ఆయన పరామర్శించనున్నట్లు కన్నబాబు వెల్లడించారు.
0 comments:
Post a Comment