హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. దుర్గేష్ తో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్ పోరాటాల వల్లే సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. వైఎస్ జగన్ ప్రజల పక్షాన నిలుస్తున్నారన్నారు. అందుకే జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని దుర్గేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నాబాబు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో దుర్గేష్ ఎమ్మెల్సీగా ఉన్నారు.

0 comments:
Post a Comment