పబ్లిసిటీ కోసమే పెద్దనోట్ల రద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పబ్లిసిటీ కోసమే పెద్దనోట్ల రద్దు

పబ్లిసిటీ కోసమే పెద్దనోట్ల రద్దు

Written By news on Wednesday, December 14, 2016 | 12/14/2016


'పబ్లిసిటీ కోసమే పెద్దనోట్ల రద్దు'
నరసాపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పబ్లిసిటీ కోసమే ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. పేదలను రోడ్డుపాలు చేసి పెద్దలకు మేలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులను రోడ్డున పడేసిన ఘనత కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలకే దక్కిందన్నారు. ప్రధాని మోదీ తన తల్లి దగ్గరున్న బంగారానికి రశీదులు తేగలరా ? అని ప్రశ్నించారు.
 
కేంద్రం నుంచి అందిన లీకులతోనే నోట్ల రద్దు విషయంలో ముందే జాగ్రత్తపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఈ అంశంపై పబ్లిసిటీ స్టంట్ మొదలెట్టారన్నారు. నోట్ల రద్దు నిర్ణయానికి ముందే చంద్రబాబు హెరిటేజ్ వాటాలను అమ్మేసుకున్న విషయం వాస్తవం కాదా? అని  రోజా నిలదీశారు. అంతకు కొద్దిరోజుల ముందు పెద్దనోట్లు రద్దుచేయమని లేఖ రాయడం, ఇప్పుడు నగదురహిత లావాదేవీలు, డిజిటల్ ఏపీ అంటూ ప్రచారాలు చేయడం అంతా డ్రామా అంటూ దుయ్యబెట్టారు. దేశంలో వంద శాతం అక్షరాస్యులే లేనప్పుడు, వంద శాతం నగదురహిత లావాదేవీలు ఎలా సాధ్యమో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలన్నారు. తుందుర్రు ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.
Share this article :

0 comments: