
ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే పీడీ కేసులు పెడుతున్నారని, అలాంటి చంద్రబాబు మీద టాడా కేసు ఎందుకు పెట్టకూడదని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా విజయనగరంలో సోమవారం నిర్వహించిన యువభేరిలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
- యువభేరిలో పాలుపంచుకునేందుకు వచ్చిన ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరుపేరునా కృతజ్ఞతలు
- మన జీవితాలు బాగుపడాలంటే ప్రత్యేక హోదా డిమాండును ఒక విప్లవంలా, ఒక కెరటంలా ముందుకు కదిలించాలి
- గతంలో చదువుల విప్లవం నాన్నగారి హయాంలో చూశారు
- నాకు బాగా గుర్తు.. అప్పట్లో ఆయన ఒక మాట అనేవారు. పేదరికం పోవాలంటే చదువుల కోసం, ఆస్పత్రుల కోసమే ఏ పేదవాడూ అప్పుల పాలు అవుతారు
- అలా కాకుండా ఉండాలన్నా, వాళ్లు తమ జీవితాలు మార్చుకోవాలన్నా ఈ రెండు రంగాలకు భరోసా ఉండాలి అనేవారు
- ఆయన పాలన ఒక స్ఫూర్తి
- అంతవరకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవాళ్లు ఎవరైనా పేదలు, బీసీల మీద ప్రేమను మాటలకే పరిమితం చేసేవారు
- నాలుగు ఇస్త్రీపెట్టెలు, నాలుగు కులవృత్తుల పరికరాలు ఇచ్చి బీసీలకు మేలు చేశామని ప్రకటించుకునేవారు
- పేదరికం పోవాలంటే ఆ కుటుంబం నుంచి ఒక్కరైనా పెద్దచదువులు చదవాలని, అందుకు అప్పుల పాలు కాకూడదని రాజశేఖరరెడ్డి చదువుల విప్లవాన్ని తీసుకొచ్చారు
- ఆ విప్లవంతో ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ.. ఇలా ఏం చదవాలన్నా పేదరికం అడ్డురాకుండా ఉండేది
- ఇంజనీరింగ్‌కు లక్షన్నర అవుతుందన్నా.. తానున్నా చదివిస్తా అనేవారు. డాక్టర్ చదవాలంటే రెండున్నర లక్షలవుతుందన్నా చదివించారు
- అప్పట్లో అలా భరోసా ఉండేది
- ఆ చదువుల విప్లవం ఇప్పుడు తెరమరుగు అవుతోంది. పిల్లలను అలా చదివించాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రులకు లేకుండా పోయింది
- ఇటువంటి చదువుల విప్లవాన్ని ఇప్పుడు దిగజార్చేశారు.
- ఇంజనీరింగ్ చదవాలంటే 70 వేల నుంచిలక్షన్నర వరకు అవుతోంది. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేది ముష్టి వేసినట్లు 35 వేలు. మిగిలింది మీరే కట్టుకుని, అప్పుల పాలు కండి అంటారు.
- కథ మళ్లీ మొదటికొచ్చింది. వీళ్లిచ్చేది పప్పు బెల్లాలకు కూడా సరిపోదు. మిగిలిన మొత్తం కోసం తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తోంది
- రాజశేఖరరెడ్డి హయాంలో చదువుల విప్లవం.. ఇప్పుడు ఉద్యోగాల విప్లవం రావాలి:
- ఇది జరిగేది ఎప్పుడంటే, ప్రత్యేక హోదా వస్తే మాత్రమే
- నిన్నటికంటే నేడు, నేటికంటే రేపు మనం బాగున్నామంటేనే అభివృద్ధి అంటారు
- ప్రభుత్వం వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. అయినా మనం నిన్నటి కంటే నేడు, నేటి కన్నా రేపు బాగున్నామా.. బాగుండే పరిస్థితి ఉందా అనేది ఆలోచించాలి
- రాష్ట్రాన్ని అప్పుడు విడగొట్టేటపుడు అప్పట్లో మనం బాగుపడతామని మాటలు ఇచ్చి విడగొట్టారు
- రాష్ట్రం అభివృద్ధిలో పరిగెడుతోందని చంద్రబాబు అంటున్నారు. జీడీపీ వృద్ధిరేటు 12.20 శాతం ఉందని చెబుతున్నారు
- దేశం మొత్తానికే 7.20 శాతం ఉంటే.. దానికంటే 5 శాతం ఎక్కువ వృద్ధి సాధించామని అంటున్నారు.. నిజంగా అలా జరుగుతోందా?
- జీడీపీ వృద్ధిరేటుకు మూడు కారకాలు చూస్తారు
- వాటిలో మొదటిది వ్యవసాయ రంగం, రెండోది పారిశ్రామిక రంగం, మూడోది సేవారంగం
- ఈ మూడింటిలో పురోగతి ఉంటే దాన్ని గ్రోత్ రేట్ అంటారు
- జాతీయ సగటు కంటే ఎక్కువగా రాష్ట్రంలో వృద్ధి ఉందని చంద్రబాబు అంటున్నారు
- వ్యవసాయ రంగం ఎలా ఉందో, రైతుల పరిస్థితి ఏంటో చూద్దాం
- ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ మూడేళ్లలో వరసగా కరువులు లేదా అతివృష్టి
- వ్యవసాయం బ్రహ్మాండంగా జరిగిందా.. 130 కోట్ల జనాభాలో 65 శాతం మంది వ్యవసాయం మీదే ఆరపడి బతుకుతున్నారు
- చంద్రబాబు సీఎం అవ్వకముందు.. రైతు రుణాలన్నింటినీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పారు.
- బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలన్నా చంద్రబాబు సీఎం కావాలన్నారు
- ఆయన సీఎం అయ్యేనాటికి 87,612 కోట్లుగా ఉన్న రైతు రుణాలు.. ఇప్పుడు.. జూన్ నెలాఖరుకు 1,00,709 కోట్లకు చేరింది.
- రుణాలు మాఫీ కాకపోగా.. అపరాధ వడ్డీలతో తడిసి మోపెడయ్యాయి
- రబీ పంటకు బ్యాంకులు 24వేల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యం పెట్టుకుంటే, 10వేల కోట్ల టెర్మ్ లోన్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే అందులో కేవలం 14 శాతం మాత్రమే రుణాలిచ్చారు
- విశాఖపట్నం యువభేరి అవ్వగానే మంత్రులు టీవీలలోకి వచ్చి వాళ్ల ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పారు
- సోషియో ఎకనమిక్ సర్వే నిజాలు చెబుతుంది
- 2014-15లో పెద్ద పరిశ్రమలకు 1875కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు 2263 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. 4138 కోట్లు మొత్తం వచ్చాయి
- 2015-16లో పెద్ద పరిశ్రమలకు 3969 కోట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 1592 కోట్లు. రెండూ కలిపి 4961 కోట్లు వచ్చాయి.
- చంద్రబాబు మాత్రం విశాఖపట్నంలో 4.67 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసేశామని డబ్బాలు కొట్టుకున్నారు
- లేని జీడీపీ గ్రోత్‌రేటును చూపిస్తూ, కాస్తో కూస్తో వాళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలనుకున్నా ఇవ్వకుండా చేస్తున్నారు
- ఇక సేవా రంగం.. అదే సాఫ్ట్‌వేర్ రంగాన్ని విషయాన్ని చూద్దాం
- చదువుకున్నవాళ్లంతా ఉద్యోగాల కోసం బయోడేటాలు పట్టుకుని తిరుగుతున్నారు
- ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఎన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు వచ్చాయని అడుగుతున్నా
- వచ్చింది పెద్ద బోడి సున్నా మాత్రమే
- అయినా చంద్రబాబు మాత్రం ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చూపిస్తారు
- అసలు లెక్కలు మూడేళ్ల తర్వాతే వస్తాయి కాబట్టి ఇప్పుడు ఏం బొంకినా పర్వాలేదని అనుకుంటున్నారు
- ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయా అని ఈమధ్య చంద్రబాబు అంటున్నారు
- అప్పట్లో అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఉండాలని, అది కూడా ఐదేళ్లే ఇస్తే చాలదని.. పరిశ్రమలు కట్టడానికే రెండు మూడేళ్లు పడుతుందని, అది ప్రారంభమయ్యేలోపు హోదా అయిపోతే నష్టం జరుగుతుందని, కాబట్టి కనీసం 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని మోదీ సాక్షిగా చెప్పారు
- వెంకయ్య నాయుడు కూడా కనీసం 10 సంవత్సరాలైనా కావాలని వెంకయ్య అడిగారు
- వాళ్లు ప్రతి సందర్భంలోనూ పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలని చెప్పారు
- ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్లు ప్లేట్లు మారుస్తున్నారు
- వీళ్లను చూస్తే.. అసలు వీళ్లకు ప్రత్యేక హోదా మీద పూర్తి అవగాహన ఉండా అని అనుమానం వస్తుంది
- ఉండి కూడా తమ స్వార్థం కోసం, కేసుల నుంచి బయటపడేందుకు ఇలా చేశారా అని అనుమానం
- చంద్రబాబు నల్లధనం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు గానీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనంతో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపుల సాక్షిగా దొరికేశారు
- ఇంతలా జరిగినా ఆయనను అరెస్టు చేయకపోవడం, పదవి నుంచి తీసేయకపోవడం ఇక్కడ ఒక్కచోటే జరిగింది
- ఇదే సీఎంగారికి ప్రత్యేక హోదా మీద అవగాహన ఉందా అనిపిస్తుంది
- ఈ మూడేళ్లలో ఆయన చేసిన అవినీతి కార్యక్రమాల్లో దేన్నీ వదలలేదు
- రాజధాని భూములు, ఆలయాల భూములు, అసైన్డ్ భూమలు దేన్నీ వదల్లేదు
- చంద్రబాబు మైండ్‌సెట్‌లోనే ఉన్న ఆయన మంత్రులకు ఎకనమిక్స్ తెలుసా లేదా అని అనుమానం వస్తుంది
- రగ్నర్ నర్క్స్ అనే ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త పేదరికం మీద మంచి సిద్ధాంతం చెప్పారు
- పేద దేశాలు, రాష్ట్రాలు అలాగే ఉండటానికి కారణమేంటో వివరించారు
- సమాజం గానీ, రాష్ట్రంగానీ, దేశం గానీ అభివృద్ధిలో ముందుకు వెళ్లలేకపోవడానికి కారణం పెట్టుబడులకు కావల్సినంత డబ్బు అందుబాటులో లేకపోవడం
- దీన్ని లో కేపిటల్ ఫార్మేషన్ అంటారు
- దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే.. ఆదాయాలు తగ్గుతాయి, దానివల్ల పొదుపు కూడా తగ్గుతుంది. పొదుపు తగ్గితే పెట్టుబడులకు డబ్బులు తగ్గుతాయి
- పెట్టుబడులు తగ్గితే ఉత్పత్తి తగ్గి దాని ప్రభావం ఆదాయం మీద పడుతుంది
- ఇదంతా ఒక విషవలయం లాంటిది
- కొనుగోలు శక్తి ప్రభుత్వాలు పెంచకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆయన చెప్పారు
- వస్తువులు, సేవలను కొనలేరు కాబట్టి డిమాండ్ తగ్గుతుందని, దాంతో పెట్టుబడులు తగ్గి, ఉత్పత్తి తగ్గుతుందని.. చివరకు ఉద్యోగావకాశాలు తగ్గి మళ్లీ ఆదాయం తగ్గిపోతుందని, దాంతో ప్రజలు వేటినీ కొనలేరని వివరించారన్నారు
- రాజశేఖరరెడ్డి గారి హయాంలో రైతులకు శాశ్వతంగా ఆదాయం ఉండేలా దారి చూపించారు
- అప్పట్లో కనీస మద్దతుధర 530 నుంచి 1030 రూపాయలకు కూడా పోయింది
- రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గడం కోసం ఉచితంగా కరెంటు ఇచ్చారు
- దాంతో రైతులు, ప్రజల ఆదాయస్థాయిని పెంచగలిగారు
- ప్రజలు ఖర్చుపెట్టగల ఆదాయాన్ని కూడా పెంచారు
- ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా ఇది సాధ్యమైంది
- దీంతో వాళ్లు పెట్టాల్సిన ఖర్చు తగ్గి, ఖర్చుచేయగల ఆదాయం పెరిగింది
- మిగిలిన దేశం మొత్తం 47 లక్షల ఇళ్లు కడితే ఒక్క సమైక్యాంధ్రప్రదేశ్‌లోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు
- జలయజ్ఞానికి 48వేల కోట్లు ఖర్చుచేశారు. అందువల్ల సిమెంటు, స్టీలు, లేబర్, ట్రాన్స్‌పోర్టు డిమాండ్ పెరిగింది
- ఇలా డిమాండ్ పెరగడం వల్ల, ప్రజల ఆదాయం పెరగడం వల్ల ఏపీలో ఐదేళ్లలో నమోదైన గ్రోత్ రేటు దేశంలో ఎక్కడా, ఎప్పుడూ నమోదు కాలేదు
- ఇప్పటికే చంద్రబాబు పుణ్యమాని గూండాయిజం, అవినీతి, వ్యవస్థలను మేనేజ్ చేయడం, దోచుకోవడం, ఎమ్మెల్యేల కొనుగోలు, వారికి ఉప ఎన్నికలు లేకుండా చూడటం, గ్రామాల్లో ఇసుక నుంచి ప్రతీదీ దోపిడీ చేయడంలో చంద్రబాబు గ్రోత్ రేటు త్రిబుల్ డిజిట్ చూపించారు.
- ప్రత్యేక హోదాను నీరుగార్చే వ్యవహారం గట్టిగా జరుగుతోంది
- వాళ్ల స్వార్థం కోసం 5 కోట్ల ప్రజలను నడివీధిలో నిలబెడుతున్నారు
- ప్రత్యేక హోదా వస్తే ఏపీ 29 రాష్ట్రాల్లో నెంబర్ వన్ అవుతుందనడంలో నాకు అనుమానం లేదు
- లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయనేవి ఎవరూ ఖండించలేని సత్యం
- ప్రత్యేక హోదా వస్తేనే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని, నో వేకెన్సీ బోర్డులు పోయి వాంటెడ్ బోర్డులు వస్తాయి
- ఇలాంటి ప్రత్యేక హోదా మీద అబద్ధాలు చెబుతున్నారు
- ఎవరైనా గట్టిగా అడిగితే, ఉద్యమిస్తే నిర్దాక్షిణ్యంగా పీడీ యాక్టులు పెడుతున్నారు
- బంద్ పిలుపు ఇస్తే దగ్గరుండి బస్సులు తిప్పుతున్నారు
- మనం ప్రత్యేక హోదా అడిగితే పీడీ యాక్టు పెట్టమని చెబుతున్న, హోదాను అమ్మేసిన ముఖ్యమంత్రి మీద టాడా యాక్టు పెట్టినా తప్పుందా అని అడుగుతున్నా
- వీళ్లు చెబుతున్న అబద్ధాలకు సమాధానం చెబుతా
- అరుణ్ జైట్లీ నుంచి, వెంకయ్య నుంచి చంద్రబాబు వరకు చేసిన ప్రధాన ఆరోపణలు ఇవీ
- ఏ రాష్ట్రానికీ ఇవ్వని విధంగా 25 సంస్థలు ఏపీకి ఇచ్చామని, నిధులు ఇచ్చామని జైట్లీ అన్నారు
- ఒక రాష్ట్రానికి ఇంత సాయం చేయడం ఎక్కడా చూడలేదని వెంకయ్య
- ప్రత్యేక హోదా వల్ల కేంద్ర సాయంలో 90 శాతం కేంద్రం భరించడం తప్ప వేరే ఉపయోగం లేదని అన్నారు
- మీరు చెబుతున్న ఐఐటీలు, ఐఐఎంల లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రంలో ఉండాలని గతంలో యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
- కోటి జనాభా దాటినవి 20 ఉన్నాయి. ఉన్నవి 22 ఐఐటీలు, 30 41 ఎన్ఐటీలు, 19 ఐఐఎంలు, 19 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌కు ఇవి ఇవ్వడం ఇదేదో దానం చేయడమా అని అడుగుతున్నా.. అలా ప్రకటనలు చేసి అవమాన పరుస్తున్నారు
- ఇటీవల గుజరాత్‌లో రైల్వే యూనివర్సిటీని ఎలా ఇచ్చారు?
- హైదరాబద్‌లో ఐఐటీసీ, సీసీఎంబీ, హెచ్ఐఎల్, మిథాని, బీడీఎల్, డీఎంఆర్ఎల్, డీఆర్‌డీఎల్, డీఆర్‌డీఓ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎలా కట్టారు?
- గుజరాత్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో 60 మిలియన్ టన్నుల సాయంతో పెట్రో రిఫైనరీని ఎలా పెట్టారు?
- చట్టంలో ఉన్నా మనకు చేయాల్సినవి చేయడం లేదు, రైల్వే జోన్ ఇవ్వడం లేదు
- కనీసం హైదరాబాద్‌లో ఉన్న సంస్థలు ఏ చట్టంలో లేకపోయినా కట్టించారు. వాటన్నింటినీ సీమాంధ్రకు కూడా తెస్తామని కనీసం మీ నోటి నుంచి మాట కూడా రానప్పుడు ఇంత అభివృద్ధి చూడలేదని వెంకయ్య నాయుడు ఎలా చెబుతారు?
- హైదరాబాద్‌లో ఉన్న సంస్థలన్నీ మన రాష్ట్రానికి ఇస్తామని కూడా చెప్పలేదు
- ఇలాంటి వ్యక్తికి చంద్రబాబు శాలువాలు కప్పి సన్మానాలు చేస్తారు
- అసలు హోదా పూర్తిగా ఎగ్గొట్టారు, ప్యాకేజి పేరుతో రోజూ అబద్ధాలు ఆడుతున్నారు
- ఈ మధ్యకాలంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రణాళికా శాఖ నుంచి ఒక సమాధానం వచ్చింది
- 2016 సెప్టెంబర్ 8న ప్రత్యేక ప్యాకేజి ఇచ్చామని, దాన్ని ఏపీ పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఇచ్చామని, అందులో పేర్కొన్న అన్నింటినీ నెరవేర్చామని చెప్పారు
- మనకు ఏ ప్యాకేజి రాకపోయినా, మేలు జరగకపోయినా ఆ పేరుతో రోజూ అబద్ధాలు ఆడుతున్నారు
- 12వ ఆర్థిక సంఘం 2004-09 వరకు అమల్లో ఉందని, ఆ సమయంలో 35 వేల కోట్లే వచ్చాయని, 13 వ ఆర్థిక సంఘం 2010-15 వరకు ఉందని, అప్పుడు వచ్చింది 69,298 కోట్లేనని, కానీ 14వ ఆర్థిక సంఘంలో ఇప్పటికి 2,03,100 కోట్లు ఇస్తున్నామని ఊదరగొట్టారు

- 14వ ఆర్థిక సంఘం నియామకం 2013 జనవరి 1వ తేదీన జరిగింది. వీళ్లు అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రాల అధ్యయనం కూడా పూర్తయింది
- వీళ్లే కాదు.. ఎవరు అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్‌కు అందే సాయం ఒక ఫార్ములా ప్రకారం వచ్చేదే.
- ఐదేళ్లలో 1,69,969 కోట్లను మనకు డెవల్యూషన్ నుంచి (కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నులు) ఇస్తున్నారు
- యూపీ, ఇతర రాష్ట్రాలకు ఇంతకంటే ఎక్కువే ఇస్తున్నారు
- రెవెన్యూ లోటును పూడ్చే గ్రాంటును కూడా అందరితోపాటు 22,113కోట్లు ఇస్తున్నారు. 1.94 లక్షల కోట్లు మొత్తం అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు
- పంచాయతీ రాజ్ వ్యవస్థలకు అన్ని రాష్ట్రాల్లాగే మనకు ఐదేళ్లలో 12వేల కోట్లు ఇచ్చారు
- మిగిలిన రాష్ట్రాలతో పాటు కలిపి ఇవ్వాల్సింది ఇచ్చారే తప్ప ఒక్క రూపాయైనా అదనంగా ఇచ్చారా అని చంద్రబాబు, జైట్లీ, వెంకయ్య నాయుడులను అడుగుతున్నా
- ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, లేనివాటి మధ్య వనరుల గ్యాప్ విషయంలో తేడా చూపలేదని మాత్రం అన్నారు.
- ప్రత్యేక హోదా వద్దని తాము చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ లిఖితపూర్వకంగా చెప్పారు
- ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు
- ప్రత్యేక హోదా వల్ల కేంద్ర పథకాల్లో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రం భరించడం తప్ప వేరే ప్రయోజనాలు ఉండవని అంటున్నారు
- ఆదాయపన్ను మినహాయింపు, సేల్స్ టాక్స్ మినహాయింపు లాంటివి వేరే రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా
- చివరకు ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రానికి కూడా రాయితీలు కల్పించారు
- ఇంత దారుణంగా పద్ధతి ప్రకారం మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు
- ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా మాట్లాడుతున్న ఈ వ్యక్తులను చూసినప్పుడు.. సమాజంలో అనేక అనర్థాలకు కారణం మూర్ఖులు అబద్ధాలను నిజాలుగా చెప్పి వాదిస్తుంటే మేధావులు మౌనంగా ఉండటమే కారణమని బెర్ట్రండ్ రసెల్ అన్నారు
- ఇప్పుడు నిజంగా అదే సమస్య. అందరం కలిసికట్టుగా గళం విప్పితే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు
- పక్కన అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు.
- మరి పార్లమెంటు సాక్షిగా మనకు మాట ఇచ్చినప్పుడు .. దాన్ని సాధించడానికి మనమంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని, ఇందులో మీరంతా తోడుగా రావాలని కోరుతున్నా.
- యూనివర్సిటీల నుంచి వచ్చి సంఘీభావం తెలిపిన ప్రొఫెసర్లు, విజయ్‌కుమార్, సత్యనారాయణ, ఇస్మాయిల్, జేవీ ప్రభాకరరావు, పసుమర్తి శ్రీనివాస సుబ్బారావు, బి. రామకృష్ణారావు, సాంబిరెడ్డి, ఇంకా డాక్టర్ సత్యారావు, అడ్వకేట్ ఈశ్వర్.. ప్రతి
0 comments:
Post a Comment