పంటలు పండని పరిస్థితి, కరువుతో ప్రజల అవస్థలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పంటలు పండని పరిస్థితి, కరువుతో ప్రజల అవస్థలు

పంటలు పండని పరిస్థితి, కరువుతో ప్రజల అవస్థలు

Written By news on Monday, December 26, 2016 | 12/26/2016


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డబ్బు పిచ్చి తప్ప రైతుల మీద అభిమానం ఏమాత్రం లేదని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాగునీరు, సాగునీటి కోసం వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
  • పులివెందుల మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టాం
  • పులివెందులలో తాగునీటి పరిస్థితి ఎలా ఉంది, రైతులు ఎలా బతుకుతున్నరన్న విషయాలు చంద్రబాబు దృష్టికి పోవాలి
  • పంటలు పండని పరిస్థితి, కరువుతో అలమటిస్తున్న పరిస్థితితో ప్రజలు అవస్థలు పడుతున్నారు
  • చిత్రావతిలో నీళ్లున్నా రైతులకు నీళ్లు వదలడం లేదు
  • చిత్రావతి డ్యాం సామర్థ్యం 10 టీఎంసీలు. దీనికి జరిగిన కేటాయింపు కేవలం 3.2 టీఎంసీలు
  • ఇందులోనూ మొదటి విడతగా ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 7 వరకు 1.8 టీఎంసీలు ఎంపీఆర్ నుంచి ఇచ్చారు
  • చివరకు చిత్రావతికి చేరిన నీరు 0.67 టీఎంసీలు మాత్రమే.. అంటే 63 శాతం నష్టమైంది.
  • రెండో విడతగా ఎంపీఆర్ నుంచి 1.4 టీఎంసీల నీళ్లు పంపారు. కానీ చేరినవి కేవలం 0.66 టీఎంసీలే, అంటే 53 శాతం నష్టాలు
  • ఇప్పుడు చిత్రావతిలో మొత్తం 1.15 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి
  • చిత్రావతి నుంచి సాగునీరు అందించాలంటే డ్రైవింగ్ హెడ్ కనీసం 0.9 టీఎంసీలు ఉంటే తప్ప సాధ్యం కాదు
  • ఇప్పుడు 1.15 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి కనీసం సాగునీరు అందించే అవకాశం ఉంది
  • కానీ ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 22 నుంచి చిత్రావతికి నీళ్లు ఇవ్వడం మానేసింది
  • డ్రైవింగ్ హెడ్ ఉన్నప్పుడు చిత్రావతికి కాస్తోకూస్తో నీరు పంపి, పులివెందుల స్టోరేజి ట్యాంకులు, లింగాల చెరువులు నింపుకొని రైతులకు ఉపయోగపడచ్చు
  • కానీ హడావుడిగా నీళ్లు ఇవ్వడం మానేశారు
  • కదిరి, ధర్మవరం మునిసిపాలిటీలకు కూడా తాగడానికి 41 క్యూసెక్కుల చిత్రావతి నీళ్లు ఇస్తున్నారు 
  • ఆ తర్వాత నీళ్లు ఇచ్చినా దాన్ని డ్రైవింగ్ హెడ్ పెంచుకోడానికి పనికొస్తుంది తప్ప సాగునీరు ఇవ్వడం కుదరదు
  • శ్రీశైలంలో నీళ్లున్నా గండికోట కట్టకపోవడంతో పులివెందులకు నీళ్లు రావాలని వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలు నెరవేరడం లేదు
  • తుంగభద్ర నీళ్లు ఏవిధంగానూ సరిపోవు కాబట్టి కనీసం కృష్ణా నీళ్లయినా వస్తే బాగుండేది
  • గండికోట, గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తయితే నీళ్లు వచ్చేవి
  • చంద్రబాబు పాలనలోకి వచ్చి మూడేళ్లయినా చాలీచాలని కేటాయింపులతో ప్రాజెక్టులు కడుతున్నారు
  • గాలేరు - నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు తన తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నికల ముందొచ్చి ప్రాజెక్టుల ముందు టెంకాయలు కొట్టారే తప్ప ఏనాడూ పైసలు విదల్చలేదు. 
  • గాలేరు - నగరి 13 కోట్లు, హంద్రీనీవాకు 17 కోట్లు ముష్టి వేసినట్లు ఇచ్చారు
  • తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు 
  • హంద్రీనీవా, గాలేరు నగరిలకు తలో 4వేల కోట్లు కేటాయించి 80 శాతం పనులు పూర్తిచేశారు
  • మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేయడానికి కూడా చంద్రబాబు చాలీచాలని కేటాయింపులు చేస్తున్నారు. 
  • పట్టిసీమ నుంచి రాయలసీమకు ఏమైనా వచ్చాయా.. అక్కడినుంచి ఇక్కడకు ఏమనా కెనాల్ వేశారా?
  • పట్టిసీమ నుంచి 48 టీఎంసీలు ప్రకాశం బ్యారేజికి వచ్చాయి
  • శ్రీశైలం నుంచి కిందకు వాడుకోవచ్చని జీవో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నా
  • చివరకు ఏ స్థాయిలో అన్యాయాలు, మోసాలు ఉన్నయో చూద్దాం
  • గండికోట ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలని 22 గ్రామాల వాళ్లు అడుగుతుంటే, చంద్రబాబు సీఎం అయి మూడేళ్లయినా మాటలు చెబుతాడు గానీ రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు
  • గండికోటలో 26 టీఎంసీల సామర్థ్యం నిల్వచేయాల్సి ఉంది. ఇప్పటికి గాలేరు-నగరి పూర్తయి ఉంటే శ్రీశైలం నుంచి రోజుకు 22వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చేవి, గండికోట కళకళలాడేది
  • ఆ తర్వాత చిత్రావతి, పైడిపాలెం అన్నింటికీ కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు వచ్చేవి
  • గొప్పగా నీళ్లు తెస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం ఎందుకని చంద్రబాబును అడుగుతున్నాం
  • ఇచ్చామన్నట్లుగా భిక్షం వేసినట్లు కాదు.. పెండింగులో ఉన్న ప్రతి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలి
  • గండికోటకు 26 టీఎంసీల నీళ్లు తేవాలి
  • చిత్రావతి, పైడిపాలెం లకు కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు అందించాలి
  • తుంగభద్ర నుంచి చిత్రావతికి మళ్లీ కేటాయిస్తూ ఆ తర్వాత పీబీసీ, లింగాల బ్రాంచి కెనాల్‌కు కూడా వెంటనే నీళ్లు వదలాలని డిమాండ్ చేస్తున్నాం
  • ఇప్పుడున్న పరిస్థితిని గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
  • రైతుల దుస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఇక్కడ ధర్నా చేస్తున్నాం
  • చంద్రబాబుకు రైతుల మీద ఏమాత్రం అభిమానం లేదు
  • కేబినెట్ సమావేశాల్లో రైతుల భూములు ఎలా లాక్కోవాలి, పెద్దలకు ఎలా ఇవ్వాలనే చూస్తాడు
  • రైతులకు రుణాలు ఇచ్చిన తీరును చూసి చంద్రబాబు సంతృప్తి చెందారట.. అది చూసి ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉన్నాయా అనిపించింది
  • బ్యాంకులు రైతులకు 24వేల కోట్ల పంటరుణాలు, 10వేల కోట్ల టెర్మ్ లోన్స్ఇవ్వాల్సి ఉంటే మొత్తం కలిపి కేవలం 4700 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నాయి.
  • రబీలో 9 లక్షల హెక్టార్లలో కూడా పంట వేయకపోయినా.. ఈయనకు సంతృప్తికరంగా ఉందట
  • ఈ మనిషికి ఏం జరుగుతోందన్న అవగాహన లేదు. ఉండేదల్లా డబ్బు, డబ్బు డబ్బు అనే పిచ్చి తప్ప ఏమీలేదు
  • ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యి, చిత్రావతికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
  • రైతులు పడుతున్న అగచాట్లతో ఇప్పటికైనా బుద్ధి వస్తుందని ఆశిస్తున్నా
  • ఎంత ఎండ ఉన్నా, ధర్నా చేయకపోతే నీళ్లు రావేమోనని రైతులు వ్యక్తం చేసిన ఆవేదనను ఆయన గుర్తించాలి
Share this article :

0 comments: