వైఎస్ఆర్‌ సీపీలో చేరిన కాసు మహేష్‌ రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్‌ సీపీలో చేరిన కాసు మహేష్‌ రెడ్డి

వైఎస్ఆర్‌ సీపీలో చేరిన కాసు మహేష్‌ రెడ్డి

Written By news on Friday, December 16, 2016 | 12/16/2016


వైఎస్ఆర్‌ సీపీలో చేరిన కాసు మహేష్‌ రెడ్డి
నరసరావు పేట: రాజన్న రాజ్యం వచ్చే వరకు విశ్రమించబోమని అప్పటి వరకు వరకు వైఎస్‌ జగన్‌ వెంట ఉండి పోరాడుతా అన్నారు కాసు మహేష్‌ రెడ్డి.  ఆయన శుక్రవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున జేజేల నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

గుంటూరు జిల్లా నరసరావు పేటలో శుక్రవారం సాయంత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలల్లో వచ్చారు. సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా కాసు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'పౌరుషాలకు, ప్రతాపాలకు మారు పేరు పల్నాడు. ఏపీలో దుర్మార్గపు పాలన జరగుతోంది. చంద్రబాబు నియంతలా పాలిస్తున్నారు. నాగార్జున సాగర్‌ ను శ్మశానం చేసే కుట్ర చేస్తున్నారు. ప్రజల రుణం తీర్చుకునేందుకే వైఎస్‌ఆర్‌ సీపీలోకి వచ్చా. జగన్‌ ను సీఎం చేసి ఈ ప్రాంతానికి పట్టిన శని వదిలిద్దాం' అన్నారు.
Share this article :

0 comments: