సోమిరెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సోమిరెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు

సోమిరెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు

Written By news on Saturday, December 31, 2016 | 12/31/2016


సోమిరెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు..
హైదరాబాద్‌ : ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
సోమిరెడ్డి విదేశీ లావాదేవీలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేసినట్లు కాకాణి తెలిపారు. తన దగ్గరున్న అన్ని ఆధారాలు పంపానని, సోమిరెడ్డి జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. సోమిరెడ్డికి ధైర్యం ఉంటే విచారణకు ఎందుకు సిద్ధపడటం లేదని సూటిగా ప్రశ్నించారు. ఆయన ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకొని విచారణకు సిద్ధపడి, తన నిజాయితీని నిరూపించుకోవాలని కాకాణి డిమాండ్‌ చేశారు.

తనపై అక్రమ కేసులు పెడితే భయపడేది లేదని, దేనికైనా సిద్ధంగా ఉన్నానని కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. జైలుకు, కేసులకు భయపడే రకం కాదని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్‌ కేసులు పెట్టాల్సి వస్తే సోమిరెడ్డిపై రెండు,మూడొందల కేసులు పెట్టాల్సి వస్తుందని కాకాణి వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉన్న సమయంలో క్రికెట్‌ కిట్‌లు అమ్ముకున్న నీచ చరిత్ర సోమిరెడ్డిదని, చెట్టు-నీరు కార్యక్రమంలో కమిషన్లు తీసుకున్నారని అన్నారు.
తమ ప్రభుత్వమే అధికారంలో ఉందికదా అని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటానని కాకాణి తెలిపారు. వైఎస్‌ జగన్‌ పై ఆరోపణలు చేస్తే మంత్రి పదవి వస్తుందని సోమిరెడ్డి భ్రమలో ఉన్నారని అన్నారు. కాకాని ఈ సందర్భంగా సోమిరెడ్డి అక్రమాలపై ఈడీకి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు.
Share this article :

0 comments: